Big Stories

BRS New Plan for MLA’s: బీఆర్ఎస్ నయా ప్లాన్.. ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు.. మహారాష్ట్ర ఫార్ములా..!

BRS Party New Plan for MLA’s: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని రాజకీయ పార్టీలు పదే పదే చెబుతున్నాయి. దీంతో ఎమ్మెల్యేలుగా గెలుపొందినవారిలో చాలామంది కారు దిగిపోయారు. తమకున్న పరిచయాలతో కాంగ్రెస్, బీజేపీ వైపు వెళ్లిపోతున్నారు. మరికొందరు పుట్టింటికి అంటే టీడీపీలోకి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. అధికారం లేకుంటా ఐదేళ్లపాటు కేడర్‌ని కాపాడుకోవడం కష్టమని అంటున్నారు. ఈ క్రమంలో ఎవరి నచ్చని పార్టీలోకి వారు వెళ్లిపోతున్నారు.

- Advertisement -

ఎమ్మెల్యేలు పార్టీ నుంచి వెళ్లిపోతున్నారన్న విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ కీలక నేతలు వారిలో మంతనాలు సాగిస్తున్నారు. రాబోయే రోజుల్లో పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుందని చెబుతూ వాళ్లని కన్వీన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయినా సరే చాలా మంది కారు దిగిపోతున్నారు. ఈ క్రమంలో పార్టీ మారుతున్న ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు ఆ పార్టీ సిద్ధమవుతున్నట్లు ఓ ఫీలర్ బయటకు వచ్చింది. ఈ విషయమై న్యాయ నిపుణులతోనూ ఆ పార్టీ చర్చించింది.

- Advertisement -

గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం మూడు నెలల్లో అనర్హత పిటిషన్‌పై స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని గులాబీ పార్టీ చెబుతోంది. తీర్పులోని పేరా నెంబర్ 30, 33 ప్రకారం హైకోర్టు వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు.

Also Read: కొత్త నిబంధనలు, రాత్రి పదిన్నరకు షాపులు క్లోజ్

అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు ఎమ్మెల్యేలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ పార్టీలో సగానికి పైగా ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా స్పీకర్ లేఖ ఇస్తే.. బీఆర్ఎస్ పార్టీ ఉనికి పోతుందని అంటున్నారు. తద్వారా బీఆర్ఎస్‌కు గుర్తు పోతుందని, మొదటికే ముప్పు వస్తుందని అంటున్నారు.

మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీలను చీల్చింది బీజేపీ పార్టీ. దీంతో ఆయా పార్టీలు గుర్తులు సైతం కోల్పోయాయి. ఒకవేళ బీఆర్ఎస్ గనుక న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే మహారాష్ట్ర ఫార్ములాను అమలు చేయాలని సగానికిపైగానే ఎమ్మెల్యేలు చర్చించుకుంటున్నారు. మొత్తానికి బీఆర్ఎస్ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నచందంగా మారింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News