Big Stories

Warangal BRS MLC’s : ప్రశ్నార్థకంగా బీఆర్ఎస్ ఉనికి.. ఉమ్మడి వరంగల్ లో ఖాళీ అవ్వనున్న కారు

Warangal BRS MLC’s into Congress(Political news in telangana): తెలంగాణలో బీఆర్ఎస్ ఉనికే ప్రశ్నార్ధకంగా మారింది. ఇంతకాలం కల్వకుంట్ల దొర ఫ్యామిలీ సర్కస్‌లో బలవంతంగా కాలం వెళ్లదీసిన నేతలు ఒక్కొక్కరుగా దండం పెట్టి మరీ బయటికొచ్చేస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు కేకే దగ్గర నుంచి మున్సిపల్ కౌన్సిలర్ల వరకు స్థాయి బేధం లేకుండా అందరూ కారు దిగేస్తున్నారు. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు కేసీఆర్‌కు గుడ్‌బై చెప్పి కాగ్రెంస్ పంచకు చేరారు. ఇక ఇప్పుడు ఎమ్మెల్సీల వంతు వచ్చింది. గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లిన ఎమ్మెల్సీలు తమ అనుచరులతో సహా పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు.

- Advertisement -

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో పది చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. స్టేషన్‌ఘన్‌పూర్‌, జనగామ స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచినా స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. తన కుమార్తె కడియం కావ్యను కాంగ్రెస్ టికెట్‌తో వరంగల్ ఎంపీగా గెలిపించుకున్నారు. ఇక ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎమ్మెల్సీల వంతు వచ్చింది. జిల్లాలో ఆ పార్టీకి ఐదుగురు ఎమ్మెల్సీలు ఉండగా ప్రస్తుతం వారంతా కాంగ్రెస్ గూటికి చేరడానికి రెడీ అయ్యారంట.

- Advertisement -

ప్రధానంగా మాజీ మంత్రి బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య కాంగ్రెస్ పెద్దల తో చర్చలు కూడా పూర్తి చేసి గ్రీన్‌సిగ్నల్ తీసుకున్నారంట. రేపో మాపో సారయ్య కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఖాయమైందంటున్నారు. మరో ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు, మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్ సైతం హస్తం గూటికి చేరబోతున్నారన్న చర్చ నడుస్తోంది.

Also Read : ‘త్వరలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ.. సీతక్కకు హోంమంత్రి పదవి’

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసిన బసవసారయ్య బీఆర్ఎస్ లో చేరినప్పటి నుండి తగిన ప్రాధాన్యత లేకపోగా.. పార్టీలో ఎదగనివ్వకుండా తొక్కేయడంతో ఇన్నాళ్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీ బలోపేతంపై కేసీఆర్‌కు మొరపెట్టుకున్నా పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో సైలెంట్ అయ్యారు. ఇక మండలి వైస్ చైర్మన్ గా ఉన్న బండ ప్రకాష్‌కు పేరుకి పదవిలో కూర్చోబెట్టారు తప్ప, పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని ఆయన అనుచరులు అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు ఉద్యమకారుడు సీనియర్ రాజకీయ నాయకుడైన ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు పరిస్థితి సైతం అదేవిధంగా ఉంది. ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడటంతో పాటు, పార్టీలో ప్రాధాన్యత లభించకపోవడంతో రవీంద్ర ఆసహనంతో ఉన్నారు.

సొంత పార్టీలో ప్రాధాన్యత లేకపోవడం, అధికారంలో లేకపోవడంతో తమ వాళ్లకు న్యాయం చేయలేమనే భావనతో ఎమ్మెల్సీలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. అదీకాక బయటపడుతున్న బీఆర్ఎస్ పార్టీ పెద్దల అవినీతి అక్రమాలతో పార్టీ భవిషత్తు ప్రశ్నార్ధకంగా తయారవుతుండటంతో.. తమ రాజకీయ భవిష్యత్తు కోసం వారు కేసీఆర్‌కు రాంరాం చెప్పేయాలని ఫిక్స్ అయ్యారంట. సీనియర్ రాజకీయ నేత రామసహాయంకు శిష్యుడిగా పేరుపొందిన బస్వరాజు సారయ్య హస్తం పార్టీలోకి వచ్చేందుకు చర్చలు జరిపారని.. ఆయనతోపాటు మరికొంతమంది ఎమ్మెల్సీలను సైతం హస్తం గూటికి చేరుస్తున్నారనే చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అతి త్వరలోనే ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య కూడా కారు పార్టీని వదిలి మరో ఇద్దరు ఎమ్మెల్సీలతో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తుంది. సారయ్య ఎపిసోడ్ ముగిశాక శాసనమండలిలోని మిగిలిన ఎమ్మెల్సీలకు కూడా కాంగ్రెస్ గేట్లు తెరుచుకుంటాయంటున్నారు. 40 మంది ఎమ్మెల్సీలున్న శాసనమండలిలో రెండు సార్లు అధికారంలో కొనసాగిన బీఆర్‌ఎస్‌కు 30 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. వారిలో 20 మంది పార్టీ మారితే మండలిలో బీఆర్ఎస్ టెక్నికల్‌గా కాంగ్రెస్‌లో విలీనమైనట్లే. కీలకమైన బిల్లులు మండలిలో ఆమోదం పొందాలంటే కాంగ్రెస్ బలం పెంచుకోవాల్సి ఉంది. అందుకే అధికారపక్షంలో మండలిలో కూడా కారుపార్టీని ఖాళీ చేయించడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందంట.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News