Big Stories

kishanreddy says BRS close: బీఆర్ఎస్ పనైపోయింది, తర్వాత మేమే అంటూ..

Kishanreddy says BRS close(TS politics): తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి? ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయ మార్పులు చోటు చేసుకుంటున్నాయా? ఇక షెడ్ నుంచి కారు బయటకు రాదా? అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీ, చివరకు ఎంఐఎం సైతం బీఆర్ఎస్‌పై ఎందుకు మండిపడుతున్నాయి? ఇవే ప్రశ్నలు తెలంగాణ ప్రజలను ఇప్పుడు వెంటాడుతున్నాయి.

- Advertisement -

తాజాగా తెలంగాణలో బీఆర్ఎస్ పనైపోయిందన్నారు స్టేట్ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి. లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఉనికి కోల్పోయిందన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, తెలంగాణలో వచ్చిన ఫలితాల పై సంతృప్తి వ్యక్తంచేశారు. తమ పార్టీ ప్రతీ ఎన్నికల్లోనూ బలం పుంజుకుంటోందన్నారు. ఈసారీ తమ పార్టీ కి బలం పెరిగిందన్నారు. తెలంగాణలో బీజేపీ బలపడటానికి ఇది ప్రారంభం మాత్రమేనన్నారు.

- Advertisement -

బీఆర్ఎస్‌కు వచ్చిన ఓట్ల శాతం తగ్గిపోగా, తమకు అమాంతంగా పెరిగిందన్నారు. చాలా చోట్ల బీఆర్ఎస్‌కు డిపాజిట్లు రాలేదన్నారు. తమ పార్టీ ఎనిమిది సీట్లు గెలిచిందన్నారు. గత ఎన్నికల్లో పోల్చితే కాంగ్రెస్‌కు ఒక్క శాతం మాత్రమే పెరిగిందన్నారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీ-బీఆర్ఎస్ కలిశాయన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. కాబట్టే బీఆర్ఎస్ బలంగా ఉన్న మెదక్‌లో బీజేపీ గెలిచిందంటే కారణం ఎవరని అన్నారు. ఇరు పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం జరగలేదా అన్నారు. అందువల్లే తాము సీట్లు కోల్పోయామని చెప్పుకొచ్చారు.

ALSO READ:  సికింద్రాబాద్‌లో యాక్సిడెంట్, మూడు పల్టీలు కొట్టిన కారు..

ఇక ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. చాలాచోట్ల బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు బీజేపీకి సపోర్టు చేసినట్టు తమ దృష్టి వచ్చిందన్నారు. ఫ్రెండ్లీ పార్టీ అంటూనే చెత్త స్ట్రాటజీని అమలు చేసిందని దుయ్యబట్టారు. ఈ క్రమంలో బీఆర్ఎస్-ఎంఐఎం మధ్య రాబోయే రోజుల్లో పొత్తు ఉంటుందా? లేదా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఈ లెక్కన రాబోయే రోజుల్లో కారు పార్టీ పరిస్థితి ఏంటని నేతలతోపాటు కార్యకర్తలు చర్చించుకోవడం కొసమెరుపు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News