Big Stories

MLA Rajasingh Comments on Asaduddin: అసదుద్దీన్ పార్లమెంట్ పరిధిలోనే ఎక్కువగా మర్డర్లు: రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

MLA Rajasingh Comments MP Asaduddin Over murders in Hyderabad: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓల్డ్ సిటీ మర్డర్లకు అడ్డాగా మారిందన్నారు. ఈ నెలలో అక్కడ అత్యధికంగా మర్డర్లు జరిగాయన్నారు. పాతబస్తీలో తెల్లవారుజామున 2, 3, 4 గంటల వరకు దుకాణాలు, హోటల్స్ తెరిచే ఉంచుతున్నారు.. వాటిని బంద్ చేసేందుకు పోలీసులు వారి విధులు వారు నిర్వర్తిస్తున్నారు.. కానీ, వారిని ఎంఐఎం నేతలు బెదిరిస్తున్నారని ఆయన అన్నారు. ఎంఐఎం నేతలకు పాతబస్తీ అడ్డాగా మారిందన్నారు. అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంట్ పరిధిలోనే ఎక్కువ మర్డర్లు జరుగుతున్నాయని, మర్డర్లు జరిగేది కూడా వాళ్ల కులస్తులవే కదా అంటూ.. దాన్ని కంట్రోల్ చేయడానికే పోలీసులు యాక్షన్ తీసుకుంటున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

ఇందులో నీకు కలిగిన బాధేంటి అసద్ అంటూ రాజాసింగ్ ప్రశ్నించారు. మీరు పోలీసులపై ఒత్తిడి ఎందుకు తెస్తున్నారంటూ మండిపడ్డారు. ‘బాలాపూర్, మల్లేపల్లి, బేగంపేట్, శాలిబండ, అసిఫ్ నగర్, కాలా పత్తర్, కాచిగూడ, మేడ్చల్ లాంటి ప్రాంతాల్లో దోపిడీ జరుగుతోంది. మేడ్చల్ లో తెల్లవారు జామున పోలీస్ స్టేషన్ పక్కనే దోపిడీ, మర్డర్ చేశారు. పోలీసులు అంటే భయం లేకపోవడంతో మర్డర్లు, దోపిడీలు చేయొచ్చంటూ ఇంకా చెలరేగిపోతున్నారు’ అంటూ రాజాసింగ్ కామెంట్స్ చేశారు. ఇలాంటివి జరగొద్దంటే ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాలను పోలీసులు ఫాలో కావొద్దంటూ రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

ఇదిలా ఉంటే.. ఎంపీ అసదుద్దీన్ పార్లమెంటులో చేసిన స్లోగన్స్ పై రాజాసింగ్ ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. ఎంపీగా ప్రమాణం చేసిన సమయంలో జై భీమ్, జై మీమ్, జై పాలస్తీనా అంటూ అసదుద్దీన్ చేసిన నినాదాలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. భారత్ మాతాకీ జై, జై భారత్ అంటూ నినాదాలు చేయడానికి ఎందుకు సిగ్గుపడుతున్నావంటూ అసదుద్దీన్ ను ప్రశ్నించారు. ఏ దేశంలో ఉంటున్నావు.. ఏ దేశంలో తిండి తింటూ, ప్రశాంతంగా బతుకుతున్నారో ఆ దేశానికి జై కొట్టడానికి ఎందుకు నోరు రావటంలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తులు ఇంకా ఎవరైనా ఉంటే దేశం విడిచి వెళ్లిపోవాలంటూ గోషామహల్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు.

Also Read: సీఎం రేవంత్ క్లారిటీ, కేసీఆర్ లైవ్ ఇమ్మంటే.. విద్యుత్ కమిషన్‌పై కోర్టులో విచారణ

పాలస్తీనాపై అంత అభిమానం ఉంటే, వారి కోసం తాపత్రయం నిజమైతే భారత్ విడిచి పాలస్తీనాకు వెళ్లిపో అంటూ ఆయన అసదుద్దీన్ కు సూచించారు. ఒక్కసారి పాలస్తీనాకు వెళితే అక్కడ నువ్వు ఏంటి..? నీ పరిస్థితి ఏంటో సరిగ్గా అర్థమవుతుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మన దేశానికి ఇలాంటి వ్యక్తులు అవసరం లేదన్నారు. జై భారత్, భారత్ మాతాకీ జై అంటూ మాతృభూమిపై ప్రేమ ఉన్నవాళ్లకు ఇక్కడ చోటు ఉంటుందంటూ రాజాసింగ్ అన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News