Big Stories

Big Relief for KCR: రైలు రోకో కేసు.. కేసీఆర్‌కు స్వల్ప ఊరట.. కాకపోతే..!

Big Relief for Ex CM KCR on Rail Roko Case: రైలు రోకో కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వల్ప ఊరట. ఈ కేసులో కేసీఆర్‌పై విచారణకు హైకోర్టు స్టే విధించింది. ఈ క్రమంలో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అనంతరం కేసును వచ్చేనెల 18కి వాయిదా వేసింది.

- Advertisement -

తెలంగాణ ఉద్యమంలో భాగంగా రైలు రోకోకు పిలుపు ఇచ్చారన్న అభియోగాలపై ప్రజాప్రతినిధుల న్యాయస్థానంలో కేసీఆర్‌పై కేసు నమోదైంది. ఈ కేసు కొట్టివేయాలంటూ కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మల్కాజ్‌గిరి పోలీసులు ఇచ్చిన నివేదిక ఆధారంగా నమోదు చేసిన కేసులో నిందితుడిగా ఆయన్ని పేర్కొన్నారు.

- Advertisement -

బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పిలుపు మేరకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఆమె అనుచరులు 40 మంది రైలు ప్టటాలపై బైఠాయించారు. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగించడంతోపాటు రైల్వే ఉద్యోగుల విధులకు అంతరాయం కలిగించారంటూ కేసు నమోదైంది.

Also Read: కారు పార్టీపై కారుమబ్బులు.. కేసీఆర్ ఎక్కడ ?

కవితతోపాటు మరో 14 మందిని అదుపులోకి తీసుకుని రైల్వే కోర్టులో హాజరుపరిచారు. మిగిలినవారు పరార య్యారు. ఈ కేసులో తనతోపాటు మరొకరిని పరారీలో ఉన్నట్లు చూపుతూ కోర్టు కేసును విడగొట్టిందని కేసీఆర్ పిటిషన్‌లో ప్రస్తావించారు. 2023 ప్రజాప్రతినిధుల కోర్టు అభియోగ పత్రానికి నెంబరు కేటాయించి విచారణ చేపట్టింది. రైలు రోకోకు తాను పిలుపు ఇవ్వలేదని ప్రస్తావించారు.

కేవలం కొందరు ఇచ్చిన ఆధారాలతో కేసు పెట్టారని, తనపై కేసును నడపడం సరికాదని పేర్కొన్నారు. కింది కోర్టులో ఉన్న కేసును కొట్టివేయాలని ఈ సందర్భంగా ప్రస్తావించారు మాజీ సీఎం కేసీఆర్.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News