BigTV English

Bhatti Vikramarka : భట్టి విక్రమార్కకు వడదెబ్బ.. పాదయాత్రకు బ్రేక్..

Bhatti Vikramarka : భట్టి విక్రమార్కకు వడదెబ్బ.. పాదయాత్రకు బ్రేక్..


Bhatti Vikramarka Padayatra(Political news in telangana) : మండు వేసవిలో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు మరోసారి వడదెబ్బ తగిలింది. దీంతో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. మంగళవారం సాయంత్రం కేతపల్లి దగ్గర పాదయాత్రలో భట్టి విక్రమార్క అస్వస్థతకు గురయ్యారు. సూర్యాపేట నుంచి వైద్యులు వచ్చి ఆయనకు చికిత్స అందిస్తున్నారు. వడదెబ్బ కారణంగా హైఫీవర్ వచ్చింది. ఈ పరిస్థితుల్లో పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు విరామం ప్రకటించారు.

భట్టి విక్రమార్క పాదయాత్ర చేపట్టి మంగళవారానికి 96 రోజులు పూర్తైంది. కొన్ని రోజులుగా తెలంగాణలో తీవ్రమైన వడగాలులు వీస్తున్నాయి. అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని వైద్యులు హెచ్చరికలు జారీ చేశారు. అయినాసరే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాలన్న సంకల్పంతో మండుటెండలను సైతం లెక్కచేయకుండా భట్టి పాదయాత్రను కొనసాగించారు.


ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో భట్టి వడదెబ్బ బారిన పడ్డారు. విశ్రాంతి తీసుకోవాలన్న వైద్యుల సూచనతో పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. కోలుకున్న తర్వాత తిరిగి పాదయాత్రను కొనసాగించనున్నారు. పాదయాత్ర ముగింపు సభను భారీ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×