E-Paper
Advertisement

Bandi Sanjay : బండి టార్గెట్ వరంగల్‌ సీపీ.. యాక్షన్ ప్లాన్ రెడీ ..!

Bandi Sanjay : బండి టార్గెట్ వరంగల్‌ సీపీ.. యాక్షన్ ప్లాన్ రెడీ ..!

Bandi Sanjay News (Telangana BJP) : టెన్త్ హిందీ పేపర్‌ లీక్‌ కేసులో ఏ1గా ఉన్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌.. రివర్స్‌ గేమ్‌ మొదలుపెట్టారు. వరంగల్‌ సీపీపై న్యాయపోరాటానికి రెడీ అయ్యారు. ఆయనపై కోర్టులో పరువునష్టం దావా వేసేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే తన హక్కులకు భంగం కలిగించారంటూ పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నారు. సీపీ రంగనాథ్‌ ను అంత తేలిగ్గా విడిచిపెట్టబోమన్న బండి… ప్రత్యక్ష యుద్ధానికి రెడీ అయిపోయారు. ఇప్పటికే రిపోర్టు రెడీ చేసినట్లు సమాచారం. వరంగల్ సీపీపై ఉన్న ఆరోపణలను కూడా వెలికి తీయాలనే యోచనలో ఉన్నారు బీజేపీ నేతలు.

టెన్త్ పేపర్ లీక్ కు బండి సంజయ్ కుట్ర చేశారంటూ తొలుత వరంగల్‌ సీపీ రంగనాథ్‌ ప్రెస్‌మీట్‌లో చెప్పడం సంచలనంగా మారింది. ఈ కేసులో ఏ1 నిందితుడు బండి సంజయ్ అంటూ తేల్చేశారాయన. బండి డైరెక్షన్ లోనే ఈ వ్యవహారం జరిగిందన్నారు. దీంతో తనపై నిరాధారమైన ఆరోపణలు చేశారంటూ.. బండి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

ఎట్టిపరిస్థితుల్లో వరంగల్ సీపీ రంగనాథ్‌ను విడిచిపెట్టనంటూ బండి సంజయ్‌ హెచ్చరించారు. ఆయన ఆస్తుల చిట్టా బయటకు తీస్తామన్నారు. వరంగల్‌, నల్లగొండ ఎస్పీగా ఉన్న సమయంలో ఏం చేశారో తెలుసన్నారు. దళిత యువకుడు సత్యంబాబు కేసులో రంగనాథ్‌ పాత్ర ఏంటో కూడా బయటపెడతామన్నారు.

టెన్త్ పేపర్ లీక్ కేసులో సోమవారం విచారణకు రావాలని కమలాపురం పోలీసులు నోటీసులు ఇచ్చారు. కానీ విచారణకు రాలేనంటూ రిప్లై ఇచ్చారు బండి. తన ఫోన్‌ను ఎక్కడుందో తేల్చే వరకు… విచారణకు పిలువొద్దంటూ పోలీసులకు సూచించారు. దీనిపై పోలీసులు ఎలా ముందుకు వెళ్తారన్నది ఆసక్తిగా మారింది. అసలు తన ఫోన్‌తో సీపీకి ఏం సంబంధమంటూ ప్రశ్నిస్తున్నారు బండి సంజయ్‌. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన జడ్జిమెంట్‌ను గుర్తు చేశారు.

గతంలో కరీంనగర్ సీపీగా ఉన్న సత్యనారాయణ విషయంలోనూ పర్సనల్‌గా తీసుకున్నారు బండి సంజయ్. ఆయన్ను పార్లమెంట్‌కు విచారణ కోసం పిలిపించారు. మరి ఇప్పుడు ఈ వ్యవహారంపై వరంగల్ సీపీ రంగనాథ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Related News

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

Big Stories

×