E-Paper
Advertisement

Dharani: ధరణికి బీజేపీ సపోర్ట్!.. కాంగ్రెస్‌పై బండి మైండ్ గేమ్..

Dharani: ధరణికి బీజేపీ సపోర్ట్!.. కాంగ్రెస్‌పై బండి మైండ్ గేమ్..
bandi sanjay kcr revanth reddy

Dharani latest news telangana(TS news updates): బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్ ఖతర్నాక్ డైలాగ్ వదిలారు. కాంగ్రెస్‌కు మైండ్ బ్లాంక్ చేసే స్ట్రాటజీ ప్లే చేశారు. కొన్నాళ్లుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ధరణి ఫైట్ నడుస్తోంది. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామని అన్నారు. వెంటనే సీఎం కేసీఆర్ అలర్ట్ అయ్యారు. అగో.. చూశారా.. కాంగ్రెస్ వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తారట.. ధరణి లేకపోతే రైతు బంధు రాదు.. రైతు బీమా రాదు.. అందుకే, కాంగ్రెస్‌నే బంగాళాఖాతంలో కలిపేయాలంటూ గులాబీ బాస్ పదే పదే పిలుపు ఇస్తున్నారు. రేవంత్ సైతం అంతే స్ట్రాంగ్‌గా రియాక్ట్ అవుతున్నారు. ధరణి రద్దు అనగానే కేసీఆర్ బెదిరిపోతున్నారని.. ధరణి వెనుక రాజులు, దొరలు ఉన్నారంటూ.. వేల కోట్ల విలువైన భూములను దోచుకుంటున్నారంటూ.. వరుస ప్రెస్‌మీట్లతో ధరణి గుట్టు రట్టు చేస్తూ వస్తున్నారు. ధరణి ఎపిసోడ్ చుట్టూ తెలంగాణ పాలిటిక్స్ హాట్ హాట్‌గా జరుగుతోంది. రేవంత్‌రెడ్డికి, కాంగ్రెస్‌కు ఫుల్ మైలేజ్ వస్తోంది. ఈ రేసులో బీజేపీ బాగా వెనుకపడిపోయింది.

కట్ చేస్తే.. బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ సరికొత్త వ్యూహంతో ముందుకొచ్చారు. బీజేపీ అధికారంలోకి వస్తే.. ధరణిని రద్దు చేయమని.. కొనసాగిస్తామంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే, ధరణి పోర్టల్‌లో అనేక సమస్యలు ఉన్నాయని.. వాటిని పరిష్కరించి.. ధరణిలో ప్రాబ్లమ్స్ లేకుండా చేస్తామని ప్రకటించారు. అక్కడితో ఆగిపోలేదు బండి సంజయ్. బీజేపీ గెలిస్తే.. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలన్నిటినీ కొనసాగిస్తామని అన్నారు. కాంగ్రెస్‌ను పైకి లేపడానికే కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. బండి సంజయ్ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.

ధరణిపై బీజేపీ వ్యూహాత్మకంగా మాట్లాడుతోందని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ యేమో.. తాము అధికారంలోకి వస్తే పక్కాగా ధరణిని రద్దు చేస్తామని చెబుతోంది. ధరణిని రద్దు చేస్తారట అంటూ సీఎం కేసీఆరేమో.. రైతులను, ప్రజలను రెచ్చగొడుతున్నారు. తాము కూడా ధరణిని రద్దు చేస్తామంటే.. కాంగ్రెస్ డిమాండ్‌కు బీజేపీ సపోర్ట్ చేసినట్టు అవుతుంది. రద్దు చేయమంటే కేసీఆర్‌కు అనుకూలంగా మారుతుంది. అందుకే, మధ్యే మార్గంగా.. ధరణిని రద్దు చేయమంటూనే.. సమస్యలు లేకుండా చేస్తామంటూ.. తనదైన కొత్త స్టాండ్ ఎత్తుకున్నారు కమలనాథులు. పాము చావకుండా, కర్ర విరక్కుండా.. బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని అంటున్నారు.

అయితే, ధరణి సాఫ్ట్‌వేర్ వెనుక కేటీఆర్ అనుచరులు ఉన్నారని రేవంత్‌రెడ్డి చెప్పగా.. మరి, బీజేపీ సైతం ధరణిని కొనసాగిస్తుందని చెబుతుండటంతో.. మరి, ధరణిని శ్రీధర్‌రాజు చేతిలోనే ఉంచుతారా? కంపెనీ ఓనర్లను మార్చడం అంత ఈజీనా? ధరణి వెనుక ప్రైవేట్ వ్యక్తుల పెత్తనాన్ని అంగీకరిస్తుందా? లేదంటే, ఏకంగా ధరణి సాఫ్ట్‌వేర్‌నే మార్చేస్తుందా? అది సాధ్యమేనా?

Related News

Trading Scam: స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో రూ. 25 కోట్ల భారీ స్కామ్.. షాక్‌లో బాధితులు..?

Ameenpur Lake: డేంజర్ బెల్స్.. మాయమైపోతున్న అమీన్‌పూ‌ర్ పెద్ద చెరువు..?

కిలాడీ జంట లగ్జరీ లైఫ్ బిల్డప్.. తెరవెనుక కోట్లలో చీటింగ్.. నందూస్ వరల్డ్ జంట అసలు రంగు బట్టబయలు..?

Iran Conflict: ఇజ్రాయెల్‌తో రాజీ.. ఇరాన్‌తో రాజకీయం.. ట్రంప్ ఆడుతున్న ఇంటర్నేషనల్ గేమ్ ఇదే!

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

Big Stories

×