Big Stories

Chandrababu letter to Revanth Reddy: ఈ నెల 6న తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ..

CM Chandrababu letter to Revanth Reddy(TS today news): ఈ నెల 6న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కానున్నారు. ఇందుకు సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ‘రాష్ట్రం విడిపోయి పదేళ్లు కావొస్తున్నా విభజన చట్టంలోని అంశాలు ఇంకా పరిష్కారం కాలేదు. ఈ సమస్యలన్నీ ముఖాముఖి భేటీతోనే అవి పరిష్కారమవుతాయి. అందువల్ల జులై 6న హైదరాబాద్ లో సమావేశమవుదామని ప్రతిపాదిస్తున్నాను’ అంటూ చంద్రబాబు.. రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.

- Advertisement -

కాగా, ఏపీ విభజన సమస్యలపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. కేంద్రంలోని కూటమి ప్రభుత్వం ఉండడంతో ఉమ్మడి సమస్యలను పరిష్కరించుకునేందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ వేదికగా చంద్రబాబు కసరత్తులు ప్రారంభించారు. ముందుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడాలని నిర్ణయించారు. అందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కలుద్దామంటూ రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నుంచి స్పందన ఎలా ఉంటుందో చూడాలి మరి.

- Advertisement -

అయితే, ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకోనున్నది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల తరువాత కూటమి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్న క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ రెడ్డి ఇండిపెండెంట్ గా ఎమ్మెల్సీగా గెలిచి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. పార్టీలో చురుకుగా పనిచేసి తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా నియామకమయ్యారు. ఆ తరువాత భవిష్యత్ రాజకీయ కారణాల దృష్ట్యా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. పీసీసీ అధ్యక్షుడిగానూ రేవంత్ రెడ్డి నియామకమయ్యారు. కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడంలో కీలకంగా పనిచేశారు. అధికారంలోకి వచ్చిన అనంతరం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ సీఎంగా ప్రకటించింది.

Also Read: ‘త్వరలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ.. సీతక్కకు హోంమంత్రి పదవి’

టీడీపీలో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నప్పుడు వీరి మధ్య మంచి అనుబంధం ఉండేది. పార్టీని ముందుకు నడపడంలో కీలక పాత్ర పోషించేవారు. ఇటు చంద్రబాబు కూడా రేవంత్ రెడ్డిని అన్ని విధాలుగా ప్రోత్సహించేవారు. ఈ ఇరువురు తెలుగు రాష్ట్రాలకు సీఎంలు కావడంతో హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఈ భేటీపై ఆసక్తిగా చర్చిస్తున్నారు. గతంలో ఒకే పార్టీలో పనిచేశారు.. ఇప్పుడు వేరు వేరు పార్టీలకు అధ్యక్షులుగా, ఆయా రాష్ట్రాలకు సీఎంగా ఉన్నారు.. ఈ భేటీలో అధికారిక కార్యక్రమాలకు సంబంధించిన అంశాల అనంతరం పాత రోజులను గుర్తు చేసుకుంటారా? అంటూ రాజకీయ నిపుణులు చర్చిస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News