Big Stories

3035 Posts in TGSRTC to be Filled: నిరుద్యోగులకు శుభవార్త.. ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్

3035 Posts in TGSRTC to be Filled: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఆర్టీసీలో త్వరలోనే భారీగా ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించింది. మొత్తం 3,035 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిలో 2000 డ్రైవర్ ఉద్యోగాలు, 743 శ్రామిక్ ఉద్యోగాలు ఉన్నాయి. ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త రక్తంతో ఆర్టీసీని మరింత బలోపేతం చేస్తామన్నారు.

- Advertisement -

పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి..

- Advertisement -
  • డ్రైవర్ – 2000
  • శ్రామిక్ – 743
  • డిపో మేనేజర్లు/అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్లు – 25
  • అసిస్టెంట్ మెకానికల్ ఇంజినీర్ – 15
  • డిప్యూటీ సూపరింటెండెంట్(మెకానికల్)-114
  • డిప్యూటీ సూపరింటెండెంట్(ట్రాఫిక్)-84
  • సెక్షన్ ఇంజినీర్(సివిల్) – 11
  • అసిస్టెంట్ ఇంజినీర్(సివిల్) – 23
  • అకౌంట్స్ ఆఫీసర్ – 6
  • మెడికల్ ఆఫీసర్స్ (స్పెషలిస్ట్)- 7
  • మెడికల్ ఆఫీసర్స్ (జనరల్) – 7

నోటిఫికేషన్‌లో పోస్టుల వారీగా అర్హతలు, వేతనం, దరఖాస్తు తేదీలు ఉండనున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇంత పెద్ద సంఖ్యలో ఆర్టీసీలో ఉద్యోగాలను భర్తీ చేయడం ఇదే తొలిసారి కానున్నది. మహాలక్ష్మి స్కీమ్‌తో భారీగా డిమాండ్ పెరగడంతో మరిన్ని బస్సులను పెంచాలని ఆర్టీసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం కొత్త బస్సులను కొనుగోలు చేయనున్నదని సమాచారం.

Also Read: చంద్రబాబు లేఖపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఏమన్నారంటే..?

ఇదిలా ఉంటే.. టీజీఎస్‌ఆర్టీసీ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సూపర్ లగ్జరీ కేటగీరీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. ఈ క్రమంలోనే కొత్తగా 450 ఎలక్ట్రిక్ బస్సులు రాష్ట్రానికి రానున్నాయని సమాచారం. మరో వారం తరువాత దశలవారీగా ఈ బస్సులు రోడ్డెక్కనున్నాయని తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, సూర్యాపేట మధ్య ఈ కొత్త ఎలక్ట్రిక్ బస్సులను నడపనున్నట్లు సమాచారం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News