Big Stories

Wrestlers Protest : పతకాలు గంగలో కలిపేస్తాం.. ఆమరణ దీక్ష చేపడతాం.. రెజ్లర్ల హెచ్చరిక..

Wrestlers Protest : భారత రెజ్లర్ల సమాఖ్య మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ కు వ్యతిరేకంగా రెజ్లర్ల చేపట్టిన ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. ఆదివారం కొత్త పార్లమెంట్ భవనం వద్దకు ర్యాలీగా వెళ్లేందుకు సిద్ధం కాగా వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీక్ష కోసం ఇకపై జంతర్‌ మంతర్‌ వద్దకు అనుమతించబోమని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు.

- Advertisement -

ఆదివారం జరిగిన పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేస్తూ రెజ్లర్లు మంగళవారం కీలక ప్రకటన చేశారు. తాము సాధించిన పతకాలకు అర్థం లేకుండా పోయిందన్నారు.ఆ పతకాలను సాయంత్రం హరిద్వార్‌లోని గంగా నదిలో కలిపేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత ఇండియా గేట్‌ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు.

- Advertisement -

మే 28న శాంతిపూర్వకంగా నిరసన చేపడుతున్న తమపై పోలీసులు దారుణంగా వ్యవహరించారని రెజ్లర్లు మండిపడ్డారు. మహిళా క్రీడాకారులు తమకు న్యాయం చేయాలని కోరడం తప్పా? అని ప్రశ్నించారు.

రాష్ట్రపతి, ప్రధానికి పతకాలను తిరిగి ఇచ్చేద్దామన్నా.. మనసు ఒప్పుకోవడం లేదన్నారు. వారిద్దరూ తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ పతకాలే తమ ప్రాణం.. ఆత్మ.. అందుకే.. వాటిని గంగలో కలిపేశాక ఇండియా గేట్‌ వద్ద ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని రెజ్లర్‌ బజరంగ్‌ పునియా ట్వీట్‌ చేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News