Big Stories

Jessica defeat Vondrousova: వింబుల్డన్‌లో సంచలనం, డిఫెండింగ్ ఛాంపియన్‌కు షాక్, తర్వాత రౌండ్‌లో జకోవిచ్

Jessica defeat Vondrousova: లండన్ వేదికగా జరుగుతున్న వింబుల్డన్‌ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌కు ఊహించని షాక్ తగిలింది. అన్‌సీడ్ క్రీడాకారిణి లైట్‌గా తీసుకుని భారీ మూల్యం చెల్లించుకుంది. ఫలితంగా తొలిరౌండ్‌లో ఇంటిదారి పట్టిన రెండో క్రీడాకారిణిగా నిలిచింది రష్యాకు చెందిన వొండ్రుసోవా.

- Advertisement -

మహిళల సింగిల్స్ విభాగంలో రష్యాకు చెందిన వొండ్రుసోవా ఝలక్ తగిలింది. ఈమె తొలి‌రౌండ్‌లో స్పెయిన్ అన్‌సీడ్ క్రీడాకారిణి జెస్సికా బౌజాస్ చేతిలో ఘోరంగా ఓటమి పాలైంది. వరుస సెట్లలో 6-4, 6-2 తేడాతో గెలిచి తర్వాత రౌండ్‌కు అర్హత సాధించింది జెస్సికా. కేవలం గంటా ఏడు నిమిషాల్లో మ్యాచ్ ముగించింది ఈ స్పెయిన్ అమ్మడు.

- Advertisement -

మెయిన్ డ్రాలో ద్వారా ఈ టోర్నీ ఎంట్రీ ఇచ్చింది ప్రపంచ 83వ ర్యాంక్ జెస్సికా. ఆది నుంచి దూకుడుగా ఆడింది.. ప్రత్యర్థి చేస్తున్న తప్పులను తనకు అనుకూలంగా మలచుకుంది. మరోవైపు ప్రేక్షుకుల నుంచి మాంచి మద్దతు లభించింది. ఈ క్రమంలో ఐదు బ్రేక్ అవకాశాలను సద్వినియోగం చేసుకున్న జెస్సికా, ప్రత్యర్థిపై పైచేయి సాధించింది.

అనవసరంగా ఏడు తప్పిదాలు చేసి వొండ్రసోవా చివరకు ఓటమిని కొని తెచ్చుకుంది. అంతేకాదు డిఫెండింగ్ ఛాంపియన్ తొలి రౌండ్‌లో ఓడిపోవడం వింబుల్డన్ చరిత్రలో ఇది రెండోసారి. గతంలో 1994 జర్మనీ తార స్టెపీగ్రాప్ కూడా ఇలానే ఓటమిపాలైంది.

మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నెంబర్ వన్ క్రీడాకారుడు జకోవిచ్ శుభారంభం చేశాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత ఈ టోర్నీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన, ఏడు సార్లు ఛాంపియన్ అయిన చెక్‌కి చెందిన కొప్రికాను తేలిగ్గా ఓడించాడు. వీరిద్దరి మధ్య పోరు నువ్వానేనా అన్నట్లు సాగుతుందని భావించినప్పటికీ కేవలం రెండు గంటల్లో ముగియడం మరో విశేషం.

ALSO READ: హెడ్‌ కోచ్ పదవికి గంభీర్‌తో పోటీ.. ఎవరీ డబ్ల్యూవీ రామన్?

తొలి‌సెట్ నుంచే దూకుడుగా ఆడిన జకోవిచ్, ప్రత్యర్థికి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. ముఖ్యంగా జకోవిచ్ సంధించిన ఏస్‌లకు కొప్రికా బోల్తా పడ్డాడు. రెండో సెట్‌లోనా ప్రత్యర్థి నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురు కాలేదు. మూడో సెట్‌లోనూ ప్రత్యర్థిని ముప్పుతిప్పులుపెట్టాడు జకోవిచ్. చివరకు మూడు సెట్లను 6-1, 6-2, 6-2 తేడాతో గెలిచి తదుపరి రౌండ్‌లో అడుగుపెట్టాడు.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News