Big Stories

Djokovic beat fearnley: వింబుల్డన్‌లో మరో సంచలనం, మూడో రౌండ్‌లో జకోవిచ్..

Djokovic beat fearnley: లండన్ వేదికగా జరుగుతున్న వింబుల్డన్‌ టోర్నమెంట్‌లో సంచనాలు కంటిన్యూ అవుతున్నాయి. మహిళల సింగిల్స్ విభాగంలో నాలుగుసార్లు గ్రాండ్‌స్లామ్ ఛాంపియన్ నవోమి ఒసాకాకు ఊహించని షాక్ తగిలింది. రెండో రౌండ్లోనే ఆమె ఇంటిదారి పట్టింది.

- Advertisement -

ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో 19వ సీడ్ క్రీడాకారిణి ఎమ్మా నవారో 6-4, 6-1 తేడాతో ఒసాకాను ఓడించి తర్వాత రౌండ్‌లోకి అడుగుపెట్టింది. తొలిరౌండ్ నుంచి ఇరువురు మధ్య కాసేపు మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. అప్పటికే ప్రత్యర్థి బలాబలాలను అంచనా వేసిన నవారో, తన విశ్వరూపం చూపించింది. దీంతో తొలి సెట్‌ను దక్కించుకున్న ఎమ్మా, తర్వాత సెకండ్‌లో ఒసాకాకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. కేవలం ఒక్క పాయింట్ మాత్రమే ఇచ్చి విజయం సాధించింది.

- Advertisement -

ఇక పురుషుల సింగిల్స్ విభాగంలో అతికష్టం మీద మూడో రౌండ్‌లో అడుగు పెట్టారు ప్రపంచనెంబర్ వన్ ఆటగాడు నవోక్ జకోవిచ్. రెండో రౌండ్‌లో బ్రిటన్‌కు చెందిన ఫియర్న్‌లే తలపడ్డారు జకోవిచ్. తొలి రెండు సెట్లు కష్టమీద గెలిచిన జకోవిచ్‌కు మూడో సెట్‌లో ఊహించని షాక్ తగిలింది. దీంతో జకోవిచ్ పనైపోయిం దని అభిమానులు భావించారు.

ALSO READ:  నాడు విమర్శలు.. నేడు జేజేలు

ఈ సమయంలో తన అస్త్రాలను బయటకు తీశాడు జకోవిచ్. నాలుగు సెట్‌లో ప్రత్యర్థి జోరుకు బ్రేక్ వేసిన జకోవిచ్, పదునైన సర్వీసులతో మ్యాచ్‌ను తనవైపు తిప్పుకున్నాడు. దీంతో నాలుగు సెట్లను 6-3, 6-4, 5-7, 7-5 తేడాతో గెలిచి మూడో రౌండ్‌లో అడుగుపెట్టాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన జకోవిచ్, కీలక విషయాలు బయటపెట్టాడు. ఈసారి తాను ఛాంపియన్ అవుతానే లేదా తెలీదు.. మూడు, నాలుగో సెట్ తనకు కమ్‌పర్ట్‌బుల్‌గా అనిపించలేదన్నాడు. కొద్దిసార్లు కష్టమైన రోజులు ఉంటాయని మనసులోని మాట బయటపెట్టాడు.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News