Big Stories

Rohit Sharma Injured : కెప్టెన్ కి గాయం: పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడతాడా ?

Rohit sharma injury update(Cricket news today telugu): టీ 20 ప్రపంచకప్ తొలి మ్యాచ్ లో టీమ్ ఇండియా విజయం సాధించినా.. ఆ ఆనందం ఎక్కువ సేపు అభిమానుల్లో లేదు. ఎందుకంటే కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతంగా ఆడి ఆఫ్ సెంచరీ చేసిన సమయంలో బాల్ మోచేతికి తగిలి గాయపడటంతో మ్యాచ్ ను వీడాడు. ఆ గాయం ఎంత పెద్దదో ప్రస్తుతానికైతే తెలీదు.

- Advertisement -

ఇంతకీ బాల్ ఎలా తగిలిందంటే.. ఐర్లాండ్ బౌలర్ జోషువా లిటిల్ వేసిన బంతి రోహిత్ మోచేతికి బలంగా తాకింది. అయితే ఫిజియోలు వచ్చి ప్రథమ చికిత్స చేశారు. ఆ నొప్పితోనే బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ.. హాఫ్ సెంచరీ చేసి, రిటైర్డ్ హర్ట్‌గా మైదానాన్ని వీడాడు.

- Advertisement -

మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మామూలుగానే క్రీజులోకి వచ్చి అందరితో కలిశాడు. ఐర్లాండ్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ లు ఇచ్చాడు. దీంతో గాయం అంత పెద్దది కాదని సోషల్ మీడియాలో అభిమానులు చెబుతున్నారు. ఈ భయమంతా ఎందుకంటే మరో మూడు రోజుల్లో ఇదే న్యూయార్క్ వేదికపై పాకిస్తాన్ తో హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది.

ఈ పరిస్థితుల్లో రోహిత్ శర్మ గాయపడటంతో అందరూ ఆందోళన చెందుతున్నారు. అదీకాక ఫస్ట్ మ్యాచ్ లో తను బ్రహ్మాండంగా ఆడాడు. 37 బంతుల్లో 52 పరుగులు చేశాడు. అందువల్ల పాకిస్తాన్ మ్యాచ్ లో రోహిత్ శర్మ ఉండాల్సిందే అంటున్నారు.

ఇకపోతే మ్యాచ్ అనంతరం గాయంపై రోహిత్ శర్మ మాట్లాడాడు. ప్రస్తుతానికైతే కాస్త నొప్పిగా ఉందని చెప్పాడు. అతని గాయం తీవ్రతను బట్టి బీసీసీఐ మెడికల్ టీమ్ చికిత్స చేస్తుంది. తగ్గకపోతే స్కానింగ్ తీస్తారు. అప్పుడు గాయం తీవ్రత తెలుస్తుంది. అక్కడ క్రాక్ వస్తే మాత్రం రోహిత్ శర్మ జట్టును వీడాల్సి ఉంటుంది.

అలా జరిగితే పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు టీమిండియా కష్టాలు తప్పేలా లేవని అంటున్నారు. కాకపోతే అంత దూరం రాదని కొందరు అంటున్నారు. ఎందుకంటే దెబ్బ తగిలిన తర్వాత కూడా మ్యాచ్ బ్రహ్మాండంగా ఆడాడు. మంచి సిక్స్ లు, ఫోర్లు కూడా కొట్టాడు. దెబ్బ గట్టిదైతే, తగిలిన వెంటనే క్రీజు వదిలేవాడు కదా. అని కొందరు అంటున్నారు. ఏం జరిగినా ఒక రోజు గడిస్తే అసలు విషయం తెలుస్తుందని కొందరు అంటున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News