Big Stories

Replace for Virat Kohli, Rohit Sharma: రోహిత్, కొహ్లీ స్థానాలను భర్తీ చేసేవారున్నారా?

Who Will Replace Virat Kohli, Rohit Sharma In T20Is: ఇద్దరు లెజండరీ క్రికెటర్లు ఒకేసారి టీ 20కి గుడ్ బై చెప్పారు. నిజానికి వీళ్లిద్దరూ వెళ్లిపోతే వెనుక క్యూ లైనులో చాలామంది ఉండవచ్చు. ప్రతిభ ఉండి, ఇంతకాలం అవకాశాలు రాలేని సంజూ శాంసన్ లాంటి వాళ్లు ఉండవచ్చు. లేక యువ ఓపెనర్లు యశస్వి జైశ్వాల్, రుతురాజ్, శుభ్ మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ ఇలా వీళ్లందరూ ఉండవచ్చు. కానీ ఎప్పటికి వీళ్లు.. విరాట్, రోహిత్ శర్మలు ఖాళీ చేసిన ప్లేస్ ని భర్తీ చేస్తారంటే, ఆన్సర్ లేదు.

- Advertisement -

నిజానికి ఓపెనర్ గా రోహిత్ శర్మ వస్తే.. జట్టులో ఒక కిక్ ఉంటుంది. టీమ్ కి ఒక ధైర్యం ఉంటుంది. సీనియర్లు ఉన్నారనే భరోసా ఉంటుంది. అదే విరాట్ ఉంటే.. జట్టుకి అండ ఉంటుంది. తను ఒక ఇన్సిపిరేషన్.. ఎంతోమంది యువ క్రీడాకారులు తనని చూసి స్ఫూర్తి పొందుతుంటారు. ఆ ఫిట్ నెస్ కాపాడుకునే విధానం, క్రీజులో రన్స్ కోసం పరుగెత్తే తీరు అంతా వేరే లెవల్ లో ఉంటుంది. అలా జట్టులో మేమున్నాం అనే నమ్మకాన్ని కలిగించేది ఎవరు? అంటే అందరూ నోరెళ్ల బెడతారు.

- Advertisement -

టీమ్ ఇండియాలో కొహ్లీ, రోహిత్ తరహాలో ఎవరైనా ఆడవచ్చు. వారి స్థాయిని అందుకోవడం మాత్రం, ఆ ఓపెనర్, ఆ ఫస్ట్ డౌన్ ప్లేస్ లను మరొకరితో ఫిల్ చేయడం ఇప్పటికిప్పుడు అసాధ్యం. ఎందుకంటే 17 ఏళ్లుగా వారి ఆటని అదేపనిగా చూసిన భారతీయులు, రేపటి నుంచి టీ 20ల్లో వారి ఆట ఉండదనేసరికి ఊహించుకోలేక పోతున్నారు.

మళ్లీ నేటి కుర్రాళ్లు కుదురుకోవాలి. సుదీర్ఘ క్రికెట్ ఆడాలి. అలుపెరగని పోరాటాలు చేయాలి. ఒంటిచేత్తో విజయాలు అందించాలి. క్లిష్ట సమయంలో ఒంటరిగా ఆడుతూ కొహ్లీలా గ్రౌండులో సింహగర్జనలు చేయాలి. ప్రతీ ఒక్కరిలో రక్తం మరిగేలా చేయాలి. ఇక రోహిత్ అయితే అలవోకగా కొట్టే సిక్స్ లు, ఓపెనర్ గా క్రీజులో ఉంటే వచ్చే పరుగులు, ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు.. ఇవెన్ని చెప్పుకున్నా తక్కువే.

టీమ్ ఇండియా ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఎంతో భావోద్వేగాల మధ్య ప్రతీ ఒక్కరూ గడిపారు. హార్దిక్ పాండ్యా కన్నీళ్లు పెట్టుకున్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ, బుమ్రా, సిరాజ్ ఇలా అందరూ తీవ్ర భావోద్వేగాల మధ్య కనిపించారు. ఆఖరికి ఎప్పుడూ కూల్ గా ఉండే కోచ్ రాహుల్ ద్రవిడ్ కళ్ల నుంచి కూడ ఆనందభాష్పాలు రాలాయి. తను చిన్నపిల్లాడిలా అందరితో కలిసి సందడి చేశాడు.

Also Read: ఆ హీరోయిన్ రికార్డును బ్రేక్ చేసిన కోహ్లీ.. ఇన్‌స్టా‌గ్రామ్‌లో ఎక్కువమంది లైక్ చేసిన ఫొటో ఇదే

అయితే ఇదంతా, టీ 20 ప్రపంచకప్ గెలిచినందుకు కాదని కొందరంటున్నారు. ఇది 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ లో ఓడి, నాడు మనసులో గూడుకట్టుకుపోయిన ఆవేదన, నేడు ఒక్కసారి కట్టలు తెగి బయటపడిందని చెబుతున్నారు.

ఇదే క్రమంలో విరాట్, రోహిత్ ఇద్దరూ టీ 20 క్రికెట్ కు గుడ్ బై చెప్పడంతో అక్కడ వాతావరణం కూడా గంభీరంగా మారిపోయింది. మొత్తానికి టీ 20 ప్రపంచకప్ గెలిచినా, విరాట్, రోహిత్ స్థానాలు ఎప్పటికి భర్తీ అవుతాయని భారతీయులు ఎదురుచూస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News