Big Stories

Who Is WV Raman: హెడ్‌ కోచ్ పదవికి గంభీర్‌తో పోటీ.. ఎవరీ డబ్ల్యూవీ రామన్?

Who Is WV Raman, Who”s Contention for India Team Head Coach Post: టీమ్ ఇండియా హెడ్ కోచ్ ఎంపికపై బీసీసీఐ మల్లగుల్లాలు పడుతోంది. ఆల్రడీ గౌతం గంభీర్ కోచ్ గా అంతా ఓకే అయిందనుకున్న సమయంలో డబ్ల్యూవీ రామన్ రేస్ లోకి వచ్చాడు. నిజానికి జాతీయ జట్టులో తన ప్రస్థానం పెద్దగా ఏమీలేదు. కానీ కోచ్ గా ముందడుగు వేయడం చూస్తుంటే, నెట్టింట రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏమైనా రికమండేషన్ క్యాండిట్టా? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

అయితే కొత్తకథనాలు కొన్ని తెరపైకి వస్తున్నాయి. గౌతం గంభీర్ అగ్రెసివ్ నెస్ పై బీసీసీఐ ఒక నిర్ణయానికి రాలేకపోతోందని  అంటున్నారు. అక్కడే ముడి తెగడం లేదని అంటున్నారు. ఎందుకంటే తను పెట్టే కండీషన్స్ కొన్ని తట్టుకోవడం కష్టమే అంటున్నారు. తనెవరి మాట వినడని, అందరూ తన మాట వినాలనే మొండి ఘటం అని అంటున్నారు. ఈ నేపథ్యంలో సడన్ గా రేసులోకి వచ్చిన ఈ డబ్ల్యూవీ రామన్ ఎవర్ భయ్? అని నేటి తరంలో ఒక డౌటు వస్తోంది. తనెవరంటే..

- Advertisement -

ఊర్కెరీ వెంకట రామన్.. (డబ్ల్యూవీ రామన్) 1965లో చెన్నయ్ లో జన్మించాడు. తనికిప్పుడు 59 సంవత్సరాలు. ఇంక ఒక్క ఏడాది దాటిందంటే నిబంధనల ప్రకారం తను టీమ్ ఇండియా హెడ్ కోచ్ పదవికి అనర్హుడైపోతాడు. ఇంక తన కెరీర్ చూస్తే.. ఎడమచేతి బ్యాటర్ అయిన రామన్ 1988లో జాతీయ జట్టులోకి ప్రవేశించాడు. 11 టెస్ట్ మ్యాచ్ లు ఆడి, 448 పరుగులు చేశారు. అత్యధిక స్కోరు 96గా ఉంది. ఇక 27 వన్డేలు ఆడి 617 పరుగులు చేశాడు. హయ్యస్ట్ స్కోరు 114గా ఉంది.

ఆనాటి రోజుల్లో టీమ్ ఇండియా ఓపెనర్ గా వచ్చే రామన్ ఆరంభంలో అంతగా ఆకట్టుకోలేదు. ఆల్ రౌండర్ కూడా అయిన రామన్ అటు వన్డే, ఇటు టెస్ట్ మ్యాచ్ ల్లో రెండేసి వికెట్లు తీసుకున్నాడు. బీసీసీఐ సెలక్షన్ కమిటీ పలు అవకాశాలిచ్చినా తను సద్వినియోగం చేసుకోలేదు. దాంతో జాతీయ జట్టులో తన స్థానం నెమ్మదిగా మసకబారిపోయింది. 1997 వరకు జాతీయ జట్టులోకి వచ్చి వెళుతూనే ఉన్నాడు.

Also Read: సీనియర్స్ రిటైర్మెంట్.. నెక్ట్స్ టీ20 పగ్గాలు ఎవరికి?

కానీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో తన ట్రాక్ రికార్డ్ బాగుంది. అనంతరం 2018లో భారత మహిళా క్రికెట్ జట్టు కోచ్ గా ఉన్నాడు. వారిని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దిన తీరు, నేడు వారు సాధిస్తున్న ఫలితాల వెనుక రామన్ ప్రణాళికలున్నాయి. వాటన్నింటి వల్ల నేడు టీమ్ఇండియా హెడ్ కోచ్ రేసులో గంభీర్ కి గట్టిపోటీ ఇస్తున్నాడని అంటున్నారు. అంతేకాదు తాను రిటైరైన తర్వాత కామెంటేటర్ గా పనిచేశాడు. క్రికెట్ విశ్లేషణలపై మంచి కాలమిస్ట్ గా పేరుతెచ్చుకున్నాడు. అంతేకాదు 2020లో ‘ద విన్నింగ్ సిక్సర్ ’పేరుతో ఒక పుస్తకం రాశాడు. అందులో క్రికెట్ ఆటపై తనకి ఉన్న ఆలోచనలను అద్భుతంగా ఆవిష్కరించాడు.

ఇవన్నీ కూడా బీసీసీఐని ఆకర్షిస్తున్నాయని అంటున్నారు. అంతేకాదు క్రికెట్ లోకి ఎంటరైన ఐపీఎల్ కార్పొరేట్ ప్రపంచంలో కీలకంగా ఉన్నాడు. అందుకనే ఆ వర్గాలతో ఒత్తిడి వస్తోందనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. అయితే మరో నాలుగురోజుల్లో ఏ విషయం తేలిపోతుంది కాబట్టి, అప్పుడు చూద్దాం లే, అని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News