Big Stories

Virat Kohli: కోహ్లీని కొట్టే మొనగాడున్నాడా ? రికార్డుల రారాజు వెనుక ఉన్నవారెవరు ?

Who is better than Virat kohli: విరాట్ కొహ్లీ పేరు వినిపిస్తేనే.. అభిమానుల్లో పూనకాలు లోడింగ్ అవుతాయి. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ దగ్గర నుంచి ఎంతోమంది కొహ్లీ అభిమానులు ఉన్నారు. ఇక ఇండియాలో శుభ్ మన్ గిల్ అయితే కొహ్లీకి వీరాభిమాని. టీమ్‌లో ఉంటే మాత్రం..తనతోనే మార్నింగ్ పరుగు దగ్గర నుంచి తన పక్కనే ఉంటాడు. కొహ్లీకి కుడిభుజంగా ఉంటాడు. ఇది రోహిత్ శర్మకి ఇష్టం లేదని, అందుకే గిల్ ని కావాలని పక్కన పెడుతుంటాడని ఒక టాక్ అయితే బయట ఉంది.

- Advertisement -

ఇంతకీ విషయం ఏమిటంటే విరాట్ కొహ్లీ టీ 20 ప్రపంచకప్‌లో ఇప్పటివరకు 27 మ్యాచ్‌లు ఆడి 1140 పరుగులు చేసి నెంబర్ వన్ బ్యాటర్‌గా నిలిచాడు. అయితే తన హయ్యస్ట్ స్కోరు 89 నాటౌట్‌గా ఉంది. అందరికన్నా ఎక్కువగా 14 హాఫ్ సెంచరీలు చేశాడు. మొత్తంగా 28 సిక్సర్లు, 103 ఫోర్లు కొట్టాడు. అన్నింటికన్నా మించి ఒక ఎడిషన్‌లో అత్యధికంగా 319 రన్స్ చేశాడు.

- Advertisement -

కొహ్లీ తర్వాత అతని రికార్డుకి దగ్గరలో ఉన్నవారిలో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (963) మాత్రమే ఉన్నాడు. 1016 పరుగులు చేసిన జయవర్ధనే, 965 పరుగులు చేసిన క్రిస్ గేల్ రిటైర్ అయిపోయారు. ప్రస్తుతం ఆడేవారిలో ఆస్ట్రేలియా నుంచి డేవిడ్ వార్నర్ (806), ఇంగ్లండ్ నుంచి జోస్ బట్లర్ (799), బంగ్లాదేశ్ నుంచి షకీబ్ అల్ హాసన్ (742), న్యూజిలాండ్ నుంచి కేన్ విలియమ్సన్ (699) ఇలా ఉన్నారు.

వీరిలో చాలామంది వచ్చే రెండేళ్లలో జరిగే వరల్డ్ కప్‌లో ఆడే అవకాశాలు లేవు. అయితే కొహ్లీకి కూడా ఇదే ఆఖరిటీ 20 వరల్డ్ కప్ అని అంటున్నారు. ఒకవేళ కొహ్లీ ఆడినా వన్డే, టెస్ట్ క్రికెట్ మాత్రమే ఆడే అవకాశాలున్నాయి.

ఎందుకంటే టీ 20 ప్రపంచకప్ ప్రారంభమైన 2007లో ఇండియా టీమ్‌లో లెజండ్రీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ లేడు. ఇది వాస్తవం. తను గొప్ప ఆటగాడే అయినా వయసు రీత్యా పక్కన పెట్టారు. అందుకని రేపు కొహ్లీ అయినా, రోహిత్ శర్మ అయినా ఒకటే.. ఈ సత్యాన్ని అభిమానులు అందరూ గ్రహించాలని నెటిజన్లు పేర్కొంటున్నారు.

Also Read: టీమ్ ఇండియా.. గేమ్ ఛేంజర్స్ వీరేనా?

అందుకని కొహ్లీ ఆడితే ఇప్పుడే ఆడి ఆ 1141 పరుగులని 1500 దాటిస్తే..మరో 10 ఏళ్లు ఈ రికార్డు జోలికి వచ్చే మొనగాడు ఉండడని అంటున్నారు. పనిలో పనిగా సెంచరీ కూడా చేసేస్తే ఆ లోటు కూడా పూర్తి అవుతుందని అభిమానులు ఆశపడుతున్నారు. అందుకే కొహ్లీ ఓపెనర్‌గా రావాలని డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News