Big Stories

Team India Openers: ఓపెనర్స్ ను మారుస్తారా? లేక.. వాళ్లే వస్తారా?

Who are the openers of Team India in T20 world cup 2024 super 8: ‘‘మీ విధానాలేటో, మీ పద్ధతులేటో.. ఒక్కటి అర్థం కావు రా బాబూ..’’ ఒక సినిమాలో చెప్పినట్టు.. టీమ్ ఇండియాలో పరిస్థితులు అలా మారిపోయాయి. ఓపెనర్స్ విషయంలో మొండి పట్టుదలకు పోయి.. ప్రపంచకప్ ని పోగొట్టరు కదా.. అని నెటిజన్లు అంటున్నారు.  ఎందుకు ఓపెనింగ్ విషయంలో కోచ్ రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మ ఇద్దరూ  ఇంతలా బిగుసుకుపోయారని అంటున్నారు.

- Advertisement -

ఇదేమీ టెస్ట్, వన్డే సిరీస్ కాదు కదా.. ఇది మెగా టోర్నమెంటు.. ఇక్కడెంత అప్రమత్తంగా ఉండాలి?  మీకంత సరదాగా ఉంటే, ప్రయోగాలు తర్వాత చేసుకోమని సలహా ఇస్తున్నారు. మూడు మ్యాచ్ ల్లో కలిపి 5 పరుగులు చేసిన విరాట్ ను ఇలాగేనే ఆడించేదని అంటున్నారు.

- Advertisement -

మరోవైపు రోహిత్ శర్మ ఇటీవల మాట్లాడుతూ కొహ్లీ, నేను ఇద్దరం ఓపెనింగ్ చేస్తామని చెప్పడంతో అభిమానులకు సిర్రెత్తుకు వచ్చింది. ఒకవైపు పట్టుమని 10 పరుగులు కూడా చేయలేకపోతుంటే, ఇంకా ఆడిస్తాను, ఓడిస్తాను అనడం ఎంతవరకు కరెక్టు అని నెటిజన్లు సీరియస్ గా కామెంట్లు పెడుతున్నారు.

ఇవన్నీ కాదు.. విరాట్ కొహ్లీయే పట్టుపట్టి ఓపెనర్ గా వస్తానని మారాం చేస్తున్నాడా? అని కూడా అంటున్నారు. ఎందుకంటే ఇది నా ప్రెస్టేజ్, నేనెందుకు ఓపెనర్ గా పనికిరాను.. అని పంతం పట్టి వచ్చి, అవుట్ అయిపోవడం లేదు కదా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Also Read: అమెరికా నుంచి లండన్ కు.. పాకిస్తాన్ వెళ్లని క్రికెటర్లు

లేక కొహ్లీకి చెప్పడానికి ద్రవిడ్, రోహిత్ శర్మ సందేహిస్తూ అయినా ఉండాలని అంటున్నారు. ఏం జరిగినా సరే, టీమ్ ఇండియా ప్రపంచకప్ తీసుకువస్తే, ఇవేవీ గుర్తుండవు. అదే ఉత్త చేతులతో వెనక్కి వస్తే మాత్రం ఈ ఓపెనింగ్ ప్రయోగంపై మాత్రం దుమ్మెత్తిపోయడం ఖాయంగా కనిపిస్తోంది.

మరోవైపు సూర్యకుమార్ గాయంపై ఎవరూ నోరు మెదపడం లేదు. మరి వస్తాడా? రాడా? అనేది తెలీదు. ఇంకా కుల్దీప్ ను తీసుకుని, సిరాజ్ ని పక్కన పెడతారని అంటున్నారు. అది కూడా వేచి చూడాలి. మొత్తానికి రేపు సూపర్ 8 ఆఫ్గనిస్తాన్ తో ఆడే టీమ్ ఇండియా జట్టు ఇలా ఉండవచ్చునని అంటున్నారు.

టీమిండియా ప్లేయింగ్ ఎలెవెన్ : రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ / సంజూ శాంసన్,  శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, అర్ష్ దీప్ సింగ్

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News