BigTV English

WFI head steps aside for now, wrestlers call off stir : తప్పుకున్న బ్రిజ్‌భూషణ్‌.. ఆందోళన విరమించిన రెజ్లర్లు..

WFI head steps aside for now, wrestlers call off stir : తప్పుకున్న బ్రిజ్‌భూషణ్‌.. ఆందోళన విరమించిన రెజ్లర్లు..

WFI head steps aside for now, wrestlers call off stir : మూడు రోజులుగా భారత రెజ్లర్లు చేస్తున్న పోరాటం ఫలించింది. డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ జరిపేందుకు.. భారత ఒలింపిక్ సంఘం ఒక కమిటీని నియమించడం, క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌తో రెండో దఫా చర్చల్లో సమస్యల పరిష్కారంపై స్పష్టమైన హామీలు రావడంతో… శుక్రవారం అర్ధరాత్రి దాటాక రెజ్లర్లు ఆందోళన విరమించారు. ఆందోళనపై రెజ్లర్లతో కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ మారథాన్ చర్చలు జరిపారు. కొత్త కమిటీని ఏర్పాటు చేస్తామని, అది నాలుగు వారాల్లో నివేదిక ఇస్తుందని… కమిటీ విచారణ పూర్తయ్యేవరకు బ్రిజ్‌భూషణ్‌ అధ్యక్ష బాధ్యతలకు దూరంగా ఉంటాడని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్ హామీ ఇవ్వడంతో… రెజ్లర్లు ఆందోళన విరమించారు.


అంతకుముందే తమ నాలుగు ప్రధాన డిమాండ్లు పరిష్కరించాలంటూ… భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషకు రెజ్లర్లు లేఖ రాశారు. లైంగిక వేధింపుల ఫిర్యాదులపై విచారణకు తక్షణమే కమిటీ ఏర్పాటు చేయాలని, డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడి రాజీనామాతో పాటు డబ్ల్యూఎఫ్‌ఐని రద్దు చేయాలని, డబ్ల్యూఎఫ్‌ఐ వ్యవహారాల నిర్వహణకు రెజ్లర్లతో సంప్రదించి కొత్త కమిటీ ఏర్పాటు చేయాలని లేఖలో డిమాండ్ చేశారు. దాంతో, వర్చువల్‌గా సమావేశమైన ఐఓఏ అత్యవసర కార్యనిర్వాహక మండలి… బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌ మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణకు… మేరీకోమ్ సారథ్యంలో ఏడుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కమిటీలో మేరీకోమ్‌తో పాటు ఆర్చర్‌ డోలా బెనర్జీ, రెజ్లర్‌ యోగేశ్వర్‌ దత్‌, ఐఓఏ సంయుక్త కార్యదర్శి అలక్‌నంద అశోక్‌, భారత వెయిట్‌లిఫ్టింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు సహ్‌దేవ్‌ యాదవ్‌, న్యాయవాదులు తాలిష్‌ రాయ్‌, శ్లోక్‌ చంద్ర ఉన్నారు. మహిళలపై లైంగిక హింస నిరోధక చట్టం 2013 ప్రకారం కమిటీ ఏర్పాటు చేశామని ఐఓఏ తెలిపింది. కమిటీ ముందుగా నిరసనకు దిగిన రెజ్లర్లతో మాట్లాడి, ఆ తర్వాత బ్రిజ్‌భూషణ్‌ మీద వచ్చిన ఆరోపణలపై దృష్టి సారించనుంది.

Follow this link for more updates : Bigtv


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×