BigTV English

IND Vs NZ : నేడు కివీస్ తో రెండో వన్డే.. సిరీస్ కైవసంపై టీమిండియా గురి ..

IND Vs NZ : నేడు కివీస్ తో రెండో వన్డే.. సిరీస్ కైవసంపై టీమిండియా గురి ..

IND Vs NZ: రాయ్ పుర్ వేదికగా రెండో వన్డేలో తలపడేందుకు భారత్ -న్యూజిలాండ్ జట్లు సిద్ధమయ్యాయి. మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి వన్డే ఇరుజట్ల మధ్య ఉత్కంఠ భరితంగా సాగింది. చివరికి భారత్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. విజయం కోసం చివరి ఓవర్ వరకు కివీస్ పోరాడింది. ముఖ్యంగా బ్రాస్ వెల్ ఫోర్లు, సిక్సులతో పెను విధ్వంసం సృష్టించి భారత్ ను వణికించాడు. రెండో వన్డేలోనూ హోరాహోరీ పోరు తప్పదనే అంచనాలున్నాయి. ఈ మ్యాచ్ ను కూడా గెలిచి సిరీస్ ను కైవసం చేసుకోవాలన్న ఉత్సాహంతో టీమిండియా ఉంది. ఈ మ్యాచ్ లోనైనా విజయం సాధించి సిరీస్ ను సమం చేయాలన్న పట్టుదలతో కివీస్ బరిలోకి దిగుతోంది.


భారత్ బ్యాటింగ్ ..
తొలి వన్డేలో డబుల్ సెంచరీతో రికార్డులు సృష్టించిన శుభ్ మన్ గిల్ అదే జోరు కొనసాగించాలని క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సూపర్ ఫామ్ లో ఉన్న గిల్ సెంచరీ, డబుల్ సెంచరీ వరసగా కొట్టాడు. హ్యాట్రిక్ సెంచరీలు కొడతాడనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశిస్తున్నారు. హిట్ మ్యాన్ కొన్ని ఓవర్లపాటు క్రీజులో నిలబడుతున్నా.. భారీ ఇన్నింగ్స్ లు ఆడటం లేదు. గత మ్యాచ్ లో విఫలమైన కోహ్లీ, ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్ లో ఎలా ఆడతారో చూడాలి. టీ20ల్లో అదరగొడుతున్న సూర్య కుమార్ యాదవ్ వన్డేల్లో ఆశించిన మేర రాణించడంలేదు. మరి సూర్య ఈ మ్యాచ్ లోనైనా దుమ్ముదులుపుతాడేమో చూడాలి. చివరి ఓవర్లలో స్కోర్ పెంచే బాధ్యతను హార్ధిక్ పాండ్యా తీసుకోవాలి. వాషింగ్టన్ సుందర్ , శార్ధుల్ ఠాకూర్ కూడా బ్యాట్ ను ఝలిపించాలి. మొదటి బ్యాటింగ్ చేస్తే భారత్ భారీ స్కోర్ చేస్తేనే న్యూజిలాండ్ ను నిలువరించగలుతుంది.

కివీస్ బలం.. బలహీనతలు..
తొలి వన్డేలో ఓపెనర్ ఫిన్ అలెన్ తప్ప న్యూజిలాండ్ టాప్ ఆర్డర్ బ్యాటర్లు అందరూ విఫలమయ్యారు. డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్ , కెప్టెన్ లేథమ్, డారిల్ మిచెల్ , ఫిలిప్స్ ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేదు. దీంతో ఆ జట్టు 131 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. అయినా సరే మిచెల్ బ్రాస్ వెల్ అద్భుతపోరాటం చేశాడు. 78 బంతుల్లోనే 140 పరుగులు చేసి భారత్ ను బెంబేలెత్తించాడు. అతడికి సాంట్నర్ 57 పరుగులు చేసి అద్భుతంగా సహకరించాడు. గత మ్యాచ్ లో రాణించని కాన్వే, నికోల్స్ , లేథమ్ , డారిల్ మిచెల్, ఫిలిప్స్ బ్యాట్ కు పని చెబితే న్యూజిలాండ్ ను నిలువరించడం కష్టమే. కాన్వే, లేథమ్ లాంటి క్లాస్ బ్యాటర్లతోపాటు అలెన్ , డారిల్ మిచెల్ , ఫిలిప్స్ లాంటి హిట్టర్లతో కివీస్ బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా ఉంది. అటు బౌలింగ్ లోనే కివీస్ బలహీనంగా కనిపిస్తోంది. బౌల్ట్, సౌథీ లేని లోటు కనిపిస్తోంది. దీంతో కివీస్ పేస్ ఎటాక్ బలహీనంగా మారింది.


బౌలర్లకు సవాల్..
గత మ్యాచ్ లో మహ్మద్ సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. పొదుపుగా బౌలింగ్ చేయడమేకాకుండా 4 వికెట్లు పడగొట్టాడు. కులదీప్ కూడా 2 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. శార్ధుల్ ఠాకూర్ 2 వికెట్లు తీసినా పరుగులు ఎక్కువ ఇచ్చేశాడు. గత మ్యాచ్ హార్ధిక్ పాండ్యా బౌలర్ గా దారుణంగా విఫలమయ్యాడు. వికెట్ తీసినా 7 ఓవర్లలో 70 పరుగులు సమర్పించుకున్నాడు. షమీ, సుందర్ కూడా న్యూజిలాండ్ బ్యాటర్లను నిలువరించలేకపోయారు. ప్రారంభంలో వికెట్లు పడగొడుతున్నా చివరి వరస బ్యాటర్లను అవుట్ చేయడంలో భారత్ బౌలర్లు కొంతకాలంగా విఫలమవుతున్నారు. బంగ్లాదేశ్, శ్రీలంకలతో జరిగిన సిరీస్ ల్లో ఇదే జరిగింది. న్యూజిలాండ్ తో తొలి వన్డేలోనూ అదే బలహీనత భారత్ ను వెంటాడింది. దీనిపై టీమిండియా దృష్టి పెట్టాల్సి ఉంది.

పిచ్‌ రిపోర్ట్‌..
భారత్‌ – న్యూజిలాండ్‌ జట్ల మధ్య రెండో వన్డే జరిగే రాయ్‌పుర్‌ పిచ్‌ ఇటు బ్యాటింగ్‌, అటు బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటుందని క్రికెట్‌ పండితులు అంచనా వేస్తున్నారు. మ్యాచ్‌ గడిచే కొద్దీ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండొచ్చు. టాస్‌ గెలిచిన జట్టు తొలుత బ్యాటింగ్‌నే ఎంచుకొనే ఛాన్స్‌ ఉంది. ఇరుజట్లు తొలి వన్డేలో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగే అవకాశం ఉంది.

WFI head steps aside for now, wrestlers call off stir : తప్పుకున్న బ్రిజ్‌భూషణ్‌.. ఆందోళన విరమించిన రెజ్లర్లు..

Girlfriend: నడిరోడ్డు మీదే బూతులు.. వాచిపోయిన చెంపలు..

Related News

Team India : వెస్టిండీస్ సిరీస్‌కు భారత జట్టు ఎంపిక..వైస్ కెప్టెన్ గా జ‌డేజా..షెడ్యూల్ ఇదే

IND Vs AUS : ఆస్ట్రేలియాతో సిరీస్… టీమిండియా కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్

Asia Cup 2025 : టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ పై విమర్శలు…గంభీర్ పై సంజూ సీరియస్?

Pak vs Ban: ఇవాళే బంగ్లా వ‌ర్సెస్ పాక్ మ్యాచ్‌…గెలిస్తే ఫైన‌ల్స్‌, ఓడితే ఇంటికే

BCCI: బీసీసీఐ సంచ‌ల‌న నిర్ణ‌యం..ఇక ఈ ఇద్ద‌రూ పాక్‌ క్రికెట‌ర్ల కెరీర్ క్లోజ్‌

IND vs BAN: పసికూన బంగ్లాదేశ్ పై పంజా…ఆసియా కప్ ఫైనల్స్ కు టీమిండియా..ఇంటికి శ్రీలంక

IND vs BAN: త‌డ‌బ‌డిన టీమిండియా…బంగ్లాదేశ్ టార్గెట్ ఎంతంటే ?

Abhishek Sharma: అభిషేక్ కొంప‌ముంచిన సూర్య‌.. క‌ష్టాల్లో టీమిండియా, సంజూకు బ్యాటింగ్ ఇవ్వ‌క‌పోవ‌డంపై ట్రోలింగ్‌

Big Stories

×