Big Stories

Rohit Sharma: మీ అందరితో ఆ క్షణాన్ని ఆస్వాదించాలనుకుంటున్నా: రోహిత్ శర్మ

Rohit Sharma Invitation To Fans: 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచ కప్ సాధించిన టీమిండియా గురువారం ఉదయం స్వదేశంలో అడుగుపెట్టనుంది. టీమిండియా ఆటగాళ్లు ప్రత్యేక విమానంలో ఉదయం 6 గంటలకు ఢిల్లీ చేరుకోనున్నారు. అనంతరం ప్రధాని మోదీతో భేటీ అయ్యి.. ప్రపంచ కప్ జర్నీ విషయాలు షేర్ చేసుకోనున్నారు. ఆ తరువాత నేరుగా ముంబయి బయలుదేరతారు. సాయంత్రం ఐదు గంటలకు వాంఖడే స్టేడియం వద్ద విజయోత్సవ ర్యాలీ తీయనున్నారు.

- Advertisement -

అయితే ఈ విజయోత్సవ ర్యాలీకి అభిమానులు పెద్ద ఎత్తున హాజరుకావాలని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎక్స్ వేదికగా పిలుపునిచ్చాడు. మీ అందరితో మధురక్షణాలను ఆస్వాదించాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచ కప్ స్వదేశానికి వస్తుందని అందరూ జాయిన్ కావాలని పిలుపునిచ్చారు. సాయంత్రం భారత ఆటగాళ్ల తమ ఇళ్లకు చేరుకోనున్నారు.

- Advertisement -

ఇదే విషయమై బీసీసీఐ సెక్రటరీ జై షా ట్వీట్ చేశారు. టీమిండియా ప్రపంచ కప్ విజయాన్ని పురస్కరించుకుని విక్టరీ పరేడ్‌లో పాల్గొనండి అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. జులై 4న సాయంత్రం 5 గంటలకు మెరైన్ డ్రైవ్ ఉంటుందని.. అందులో పాల్గొనండి అంటూ ఆహ్వానించారు.

గత శనివారమే ప్రపంచ కప్ ఫైనల్ ముగిసినప్పటికీ కరీబియన్ దీవుల్లో హరికేన్ కారణంగా టీమిండియా ఆటగాళ్ల స్వదేశీ ప్రయాణం వాయిదా పడింది. ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది బీసీసీఐ. దీంతో గురువారం ఉదయం వారు ఇండియాకు చేరుకోనున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News