Big Stories

Rohit Sharma: రోహిత్ బాబూ.. అంత పని చేయకు!

Mohammad Kaif Wants Changes in india opening Combination at T20 world cup 2024:
టీ 20 ప్రపంచకప్ లో టీమ్ ఇండియా అద్భుతంగా రాణిస్తూ ముందడుగు వేస్తోంది. ఇప్పటికే మూడు మ్యాచ్ లు ఆడి 6 పాయింట్లతో సూపర్ 8 కి చేరింది. ఇప్పటికి ఆల్రడీ నాలుగు గ్రూప్ ల్లో కలిపి 5 జట్లు కన్ ఫర్మ్ అయిపోయాయి. అవేమిటంటే ఇండియా, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, ఆఫ్గనిస్తాన్, సౌతాఫ్రికా.. ఈ జట్లు అప్పుడే సూపర్ 8లో ఆడేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. ప్రత్యర్థుల బలబలాలు, వారిని అవుట్ చేసే బౌలర్లు ఎవరు? ఇలా లెక్కలు వేసుకుంటున్నాయి.

- Advertisement -

ఈ కీలకమైన పరిస్థితుల్లో కెప్టెన్ రోహిత్ శర్మ ఒక బాంబ్ లాంటి వార్త పేల్చాడు. అదేమిటంటే టీమ్ ఇండియాలో ఓపెనర్లు కరెక్టుగా కుదిరారు. టీ 20 వరల్డ్ కప్ అంతా కూడా విరాట్, నేను ఇద్దరం కలిసి చేస్తామని కుండ బద్దలు కొట్టినట్టు తెలిపాడు. దీంతో భారతీయులందరూ హతాశుయులయ్యారు.

- Advertisement -

నెటిజన్లు అయితే, రోహిత్ బాబూ.. అంత పని చేయకు నీకు దండం పెడతాం అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ విషయంపై  సీనియర్ క్రికెటర్లు కూడా స్పందిస్తున్నారు. ముఖ్యంగా మహ్మద్ కైఫ్ అయితే వార్నింగ్ లా చెప్పాడు. రిక్వెస్ట్ కూడా చేశాడు. మిడిల్ ఆర్డర్ లో జట్టు ఎలా ఉందో నీకు తెలియంది కాదు. కావాలంటే రిషబ్ పంత్ ని ఓపెనర్ గా తీసుకువెళ్లు. లెఫ్ట్, రైట్ కాంబినేషన్ బాగుంటుంది. కొహ్లీ ఎప్పటిలా ఫస్ట్ డౌన్ వస్తే, చివరి వరకు జట్టుని నడిపిస్తాడని తెలిపాడు.

Also Read: ఆ ఇద్దరూ ఇంటికి వచ్చేస్తున్నారు..

ఐసీసీ మెగా టోర్నమెంటుతో ఆటలు ఆడవద్దని, గెలిచే జట్టుపై ప్రయోగాలు చేయవద్దని రోహిత్ శర్మపై నెటిజన్లు మండిపడుతున్నారు. అలాగే కొహ్లీని ఫస్ట్ డౌన్ తీసుకు రమ్మనమని చెబుతున్నారు. ఇది నువ్వు కొహ్లీపై ప్రేమతో చేస్తున్నట్టు లేదు. కసితో చేస్తున్నట్టు ఉంది.

ప్రస్తుతం తను ఆడిన మూడు మ్యాచ్ ల్లో 5 పరుగులు మాత్రమే చేశాడు. అయినా ఓపెనర్ అంటుంటే, నీ మానసిక స్థితి ఎలా ఉందో తెలిడం లేదని కొంచెం ఘాటుగానే కామెంట్లు పెడుతున్నారు. ఇక  టీ 20 ప్రపంచకప్ లో అద్భుతమైన  రికార్డ్ ఉన్న కొహ్లీతో ఇలాంటి ప్రయోగాలు సరికాదని మొత్తుకుంటున్నారు. బీసీసీఐ సెలక్షన్ కమిటీ స్పందించాలని కొందరు కోరుతున్నారు. మరీ విషయంలో రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మ ఏం చేస్తారో చూడాల్సిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News