Big Stories

Virat Kohli Announces Retirement: హార్ట్ బ్రేకింగ్ న్యూస్.. రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లి

Virat Kohli announces retirement from T20 cricket: టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు టీమిండియా కీలక ఆటగాడు విరాట్ కోహ్లి రిటైర్మెంట్ ప్రకటించాడు. శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్.. దక్షిణాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విక్టరీ సాధించింది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ టీమిండియా మరోసారి విశ్వవిజేతగా నిలిచింది.

- Advertisement -

మ్యాచ్ అనంతరం రిటైర్మెంట్ పై కోహ్లి అనౌన్స్ మెంట్ ఇచ్చాడు. ‘ఇదే నా చివరి వరల్డ్ కప్.. అలాగే టీ20 మ్యాచ్ కూడా’ అంటూ విరాట్ కోహ్లి వ్యాఖ్యానించాడు. కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్ధేశంతో రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు తెలిపాడు. వారికి టీమిండియాకు ప్రాతినిధ్యం వహించే అవకాశాలు వస్తాయి. భవిష్యత్తులో భారత్ మరిన్ని మెగా టోర్నీలు సాధిస్తుందన్నారు.

- Advertisement -

టీ20 వరల్డ్ కప్ మెగా టోర్నీలో తొలి మ్యాచ్ నుంచి విరాట్ కోహ్లి పెద్దగా రాణించలేదు. కానీ ఫైనల్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి.. 59 బంతుల్లో 76 పరుగులు చేశాడు. ఇందులో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు బాదాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన విరాట్.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

మ్యాచ్ అనంతరం టీ20లకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు వెల్లడించాడు. ‘మేం సాధించాలనుకున్నది ఇదే. భారత్ తరపున ఇదే నా చివరి వరల్డ్ కప్.. చివరి టీ 20 మ్యాచ్ కూడా. నేను ఈ వరల్డ్ కప్ గెలవాలని కోరుకున్నా. ఐసీసీ వరల్డ్ కప్ గెలిచేందుకు చాలాకాలంగా వేచి ఉన్నాం. కప్ గెలవడంతో నేటికి నా కల నెరవేరినందుకు ఆనందంగా ఉంది.’ అన్నాడు.

Also Read: విశ్వవిజేతగా భారత్.. ఉత్కంఠపోరులో చతికిలపడ్డ సఫారీలు..

రోహిత్ శర్మ మొత్తం 9 టీ20 వరల్డ్ కప్‌లు ఆడగా..నేను 6 టీ20 వరల్డ్ కప్‌లు ఆడినట్లు చెప్పాడు. అయితే రోహిత్ శర్మ 2007లో తొలి టీ20 వరల్డ్ కప్ నెగ్గాడు. అతడికి ఈ కప్పు చాలా ముఖ్యమైందన్నారు. గత కొన్ని మ్యాచ్‌ల నుంచి నేను అంతగా కాన్ఫిడెంట్‌గా లేనని, ఈ మ్యాచ్ గెలవడంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సమయంలో నా భావోద్వేగాలను కంట్రోల్ చేయలేనని, ఈ విజయాన్ని ఆటగాళ్లు పూర్తి స్థాయిలో ఆస్వాదిస్తున్నారని కోహ్లి తెలిపాడు.

విరాట్ కోహ్లి 2010లో జింబాబ్వేతో తొలి టీ20 మ్యాచ్ ఆడాడు. టీ20 కెరీర్‌లో మొత్తం 125 మ్యాచ్‌లు ఆడగా..48.69 స్ట్రైక్ రేటుతో 4,188 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 38 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News