Big Stories

USA vs WI 46th Match : 10.5 ఓవర్లలో గెలిచిన వెస్టిండీస్ : నీరుగారిన అమెరికా

USA vs WI 46th Match : టీ 20 ప్రపంచకప్ లో ఉవ్వెత్తున ఎగసిన అమెరికా జట్టు ఒక్కసారి నీరుగారిపోయింది. పాకిస్తాన్ ని ఓడించి, అనూహ్యంగా సూపర్ 8 కి దూసుకొచ్చిది. సౌతాఫ్రికాతో జరిగిన తొలిమ్యాచ్ లో గెలిచినంత పనిచేసింది. మరి రెండ్రోజుల్లో ఏం జరిగిందో తెలీదు. వెస్టిండీస్ తో బార్పడోస్ లో జరిగిన మ్యాచ్ లో చప్పగా చల్లారిపోయింది

- Advertisement -

టాస్ గెలిచిన వెస్టిండీస్ మొదట బౌలింగు తీసుకుంది. దీంతో బ్యాటింగ్ కి వచ్చిన అమెరికా 19.5 ఓవర్లలో 128 పరుగులకు ఆలౌట్ అయిపోయింది. లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ 10.5 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 130 పరుగులు చేసి 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

- Advertisement -

129 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ సాధికారికంగా ఆడింది. ఓపెనర్ షై హోప్ ఇరగదీశాడు. 39 బంతుల్లో 8 సిక్స్ లు, 4 ఫోర్లతో 82 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఒక్క మాటలో చెప్పాలంటే విధ్వంసం చేశాడు. అమెరికా బౌలింగుని తుత్తునియలు చేశాడు. మరోవైపు ఓపెనర్ జాన్సన్ (15), నికోలస్ పూరన్ (27 నాటౌట్) తనకి అండగా నిలిచారు. మొత్తానికి 10.5 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 130 పరుగులు చేసి విజయ ఢంకా మోగించింది.

Also Read : క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. ఔట్‌ను నాటౌట్‌గా ప్రకటించిన అంపైర్!

హర్మీత్ సింగ్ కి మాత్రమే 1 విక్కెట్టు దక్కింది. నేత్రావల్కర్ తో సహా అందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు.

అంతకుముందు బ్యాటింగ్ ప్రారంభించిన అమెరికాకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. స్టీవెన్ టేలర్ (2) వెంటనే అవుట్ అయిపోయాడు. మరో ఓపెనర్ ఆండ్రిస్ గౌస్ 16 బంతుల్లో 1 సిక్స్ , 3 ఫోర్ల సాయంతో 29 పరుగులు చేసి కాసేపు ఆశలు రేపాడు. కానీ అంతలోనే అవుట్ అయిపోయాడు.

తర్వాత నితీష్ కుమార్ (20), కెప్టెన్ ఆరోన్ జోన్స్ (11), మిలింద్ కుమార్ (19), ఆండర్సన్ (7), హర్మీందర్ సింగ్ (0), షాడ్లీ వాన్ (18), కెనిగే (1) ఇలా చేసి అవుట్ అయిపోయారు. చివర్లో ఆలీ ఖాన్ (14 నాటౌట్) గా నిలిచాడు. మొత్తానికి 19.5 ఓవర్లలో 128 పరుగులకి అమెరికా ఆలౌట్ అయ్యింది.

వెస్టిండీస్ బౌలింగులో ఆండ్రూ రస్సెల్ 3, జోసెఫ్ 2, రోస్టన్ 3, మోటై 1 వికెట్ పడగొట్టారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News