Big Stories

Two interesting scenes in the second ODI : రెండో వన్డేలో రెండు ఇంట్రెస్టింగ్ సీన్స్

Two interesting scenes in the second ODI : న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించిన రెండో వన్డేలో… రెండు ఇంట్రెస్టింగ్ సీన్స్ కనిపించాయి. ఒకటి మ్యాచ్ కు ముందు జరిగిందైతే… మరొకటి భారత్ బ్యాటింగ్ సమయంలో కనిపించింది. అయితే… ఆ రెండూ భారత కెప్టెన్ రోహిత్ శర్మకు సంబంధించినవే కావడం విశేషం.

- Advertisement -

మ్యాచ్ మొదలవడానికి ముందు టాస్ వేశాక… రోహిత్ శర్మ ప్రవర్తన అందరికీ నవ్వు తెప్పించింది. టాస్ గెలిచిన హిట్ మ్యాచ్… బ్యాటింగ్ తీసుకోవాలా? బౌలింగ్ ఎంచుకోవాలా? అనే విషయాన్ని ఠక్కున చెప్పలేకపోయాడు. 13 సెకన్ల పాటు ఆలోచించిన తర్వాత… బౌలింగ్ ఎంచుకుంటున్నామని చెప్పాడు. సాధారణంగా టాస్ వేయగానే… గెలిచిన కెప్టెన్ ఠక్కున తన నిర్ణయాన్ని చెప్పేస్తాడు. కానీ, రోహిత్ శర్మ మాత్రం… టాస్ గెలిస్తే ఏం చెప్పాలనే విషయాన్ని మర్చిపోయాడు. కాసేపు బుర్ర గోక్కుని… నిదానంగా ఆలోచించి మరీ… తన నిర్ణయాన్ని చెప్పాడు. అతని ప్రవర్తనకు రిఫరీ జవగళ్ శ్రీనాథ్‌తో పాటు కివీస్ కెప్టెన్ లేథమ్, కామెంటేటర్ రవిశాస్త్రి నవ్వుకున్నారు. వాళ్లతో పాటు రోహిత్ శర్మ కూడా నవ్వేశాడు. దూరం నుంచి ఇదంతా గమనిస్తున్న సిరాజ్, షమి సహా కొందరు భారత ఆటగాళ్లు కూడా నవ్వుకున్నారు. టాస్‌ గెలిస్తే ఏం చేయాలనే దానిపై జట్టుతో కలిసి బాగా చర్చించానని, కానీ తీసుకున్న నిర్ణయాన్ని కాసేపు మర్చిపోయానని ఆ తర్వాత రోహిత్ శర్మ చెప్పాడు. అతని హావభావాల్ని చూస్తే… బ్యాటింగ్‌ తీసుకుందామనుకుని… చివరికి బౌలింగ్‌ ఎంచుకున్నాడేమో అని అనిపించింది.

- Advertisement -

ఇక మరో ఇంట్రెస్టింగ్ సీన్… రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కనిపించింది. టిక్నర్‌ వేసిన పదో ఓవర్‌లో మూడో బంతికి ఫోర్‌, నాలుగో బంతికి సిక్స్ బాదాడు… రోహిత్ శర్మ. స్టాండ్స్ లోకి వెళ్లిన బంతి తిరిగి వచ్చే లోపు… భద్రతా సిబ్బంది కళ్లుగప్పిన ఓ బాలుడు మైదానంలోకి దూసుకొచ్చాడు. అతణ్ని గమనించిన భద్రతా సిబ్బంది పట్టుకునేందుకు పరుగులు తీసినా… ఆలోపే ఆ బుడతడు రోహిత్‌ శర్మను హగ్ చేసుకున్నాడు. సెక్యూరిటీ సిబ్బంది బాలుణ్ని లాగేసే సమయంలో రోహిత్ శర్మ తూలి కిందపడబోయినా… బ్యాలెన్స్ చేసుకోగలిగాడు. అభిమానంతో పరుగున వచ్చిన తనను హగ్ చేసుకున్న కుర్రాడిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని భారత కెప్టెన్‌ సెక్యూరిటీ సిబ్బందితో చెప్పాడు. దాంతో… ‘రోహిత్‌ ఎంతో మంచి మనసున్నవాడు’ అంటూ అభిమానులు ప్రసంశిస్తున్నారు. ఆస్ట్రేలియాలో జరిగిన టీ-20 వరల్డ్ కప్ సమయంలోనూ… ఓ అభిమాని సెక్యూరిటీ సిబ్బంది కళ్లుగప్పి బ్యాటింగ్ చేస్తున్న రోహిత్ శర్మ దగ్గరికి వచ్చాడు. అయితే భద్రతా సిబ్బంది వెంటనే అతణ్ని పక్కకు లాగేశారు. దాంతో అతను కనీసం షేక్ హ్యాండ్ అయినా ఇవ్వాలని రోహిత్ శర్మను ప్రాధేయపడ్డాడు. కానీ, సెక్యూరిటీ సిబ్బంది అతనికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా లాక్కెళ్లిపోయారు. ఆ తర్వాత అతనికి మన కరెన్సీలో రూ.6 లక్షల జరిమానా కూడా విధించారు

Follow this link for more updates : Bigtv

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News