Big Stories

Team India in Barbados : బార్బడోస్ లో తుఫాన్.. చిక్కుకుపోయిన టీమ్ ఇండియా

Team India in Barbados : భీకర తుఫాన్ లో టీమ్ ఇండియా ఆటగాళ్లు చిక్కుకున్నారు. బార్బడోస్ లో టీమ్ ఇండియా ఫైనల్ మ్యాచ్ గెలిచిన తర్వాత.. తిరుగుముఖం పట్టాలి. ఆరోజు మనవాళ్లందరూ సంతోష సంబరాల్లో మునిగి తేలిపోయారు. కాకపోతే అదే రోజు ఉదయం భీకర తుఫాన్ ప్రారంభమైంది. దానికి బెరిల్ హరికేన్ అని పేరు కూడా పెట్టారు. నిజానికి ఫైనల్ రోజు మ్యాచ్ జరిగిన తర్వాత చిన్నపాటి వర్షం ప్రారంభమైంది. బహుశా అదే తుఫాన్ కి ఇండికేషన్ కావచ్చునని అంటున్నారు.

- Advertisement -

17 ఏళ్ల తర్వాత టీ 20 ప్రపంచకప్ గెలిచిన టీమ్ ఇండియా ప్లేయర్లకు భారత గడ్డపై ఘనంగా స్వాగత సత్కారాలు ఏర్పాటు చేసేందుకు ఘనంగా బీసీసీఐ ఏర్పాట్లు చేసింది. కానీ అభిమానులు, అధికారుల ఆశలపై బెరిల్ హరికేన్ నీళ్లు జల్లింది.

- Advertisement -

ప్రస్తుతం మన క్రికెటర్లందరూ హోటల్ గదుల్లో సురక్షితంగా ఉన్నారు. ప్రస్తుతం తుఫాను తాకిడికి ఆ ప్రాంతంలో విమాన రాకపోకలు నిలిచిపోయాయి. అయితే మ్యాచ్ జరిగిన రోజు రాత్రి బీసీసీఐ ప్రెసిడెంట్ జైషా తదితరులు ఇండియాకి తిరిగి వచ్చేశారు. లేకపోతే వీళ్లు కూడా క్రికెటర్లతో పాటు ఆగిపోయేవారే.

బెరిల్ హరికేన్ ఒక్క బార్బడోస్ కే కాదు, వెస్టిండీస్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలైన సెయింట్ లూసియా, గ్రెనడా, సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్ ప్రాంతాలపై తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంది. ఇక బార్బడోస్ లో పరిస్థితి తీవ్రత దృష్ట్యా కర్ఫ్యూ విధించారు. ప్రజలెవరూ బయటకు తిరగడానికి లేదు. అందరూ ఇళ్లల్లోనే ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో టీమ్ ఇండియా ఆటగాళ్లు ఇండియాకి రావడం ఆలస్యం అయ్యేలా ఉంది.

Also Read : ఇద్దరిలో గెలుపెవ్వరిది? టీమ్ ఇండియా కోత్త కోచ్ ఎవరు?

నిజానికి మన ఇండియాలో అయితే తుఫాను వస్తే ఒక మూడు నుంచి నాలుగు రోజుల వరకు ఉంటుంది. వర్ష తీవ్రత ఉంటుంది. ఈ లెక్కన చూస్తే వెస్టిండీస్ లో అన్నీ దీవులే కాబట్టి.. కనీసం వారంరోజుల వరకైనా తుఫాన్ ఎఫెక్ట్ ఉంటుందని అంటున్నారు. బహుశా మనవాళ్లు రావడానికి టైమ్ పట్టేలాగే ఉంది.

ఎందుకంటే తుఫాను తాకిడికి ఎయిర్ పోర్టు ఎలా ఉందో తెలీదు. మళ్లీ విమాన రాకపోకలు సిద్ధం చేయడానికి వారికి టైమ్ పడుతుంది. రోడ్లు అయితే చెట్లు పడినా క్లియర్ చేస్తారు కానీ, విమానాశ్రయాన్ని వెంటనే శుభ్రం చేయడం, రన్ వేను క్లియర్ చేయడం అంత ఈజీ కాదని అంటున్నారు. పరిస్థితులు మెరుగు పడేవరకు బార్బడోస్ లో ఆంక్షలు కొనసాగుతాయని అధికారులు చెబుతున్నారు.

మన టీమ్ ఇండియా జట్టు హరికేన్ కారణంగా బార్బడోస్ లో చిక్కుకుపోయినట్టు బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. టీమ్ ఇండియా అక్కడ నుంచి బయలుదేరిన తర్వాత సన్మాన కార్యక్రమం ఉంటుందని అన్నారు. అయితే జులై 6న టీమ్ ఇండియా జింబాబ్వే పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అక్కడ టీ 20 మ్యాచ్ లు ఆడనుంది.

ప్రస్తుతం ప్రపంచకప్ జట్టులో ఉన్న ప్లేయర్లు రింకూ సింగ్, సంజు శాంసన్, యశస్వి జైశ్వాల్, ఖలీల్ అహ్మద్ వీరందరూ జింబాబ్వే పర్యటనకు ఎంపికయ్యారు. ఒకవేళ వీరి రాక ఆలస్యమైతే, వీరి బదులు వేరేవాళ్లను జింబాబ్వేకు పంపిస్తారని బీసీసీఐ అధికారులు చెబుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News