Big Stories

Team India stuck in Barbados: బార్బడోస్ కు తుఫాన్ హెచ్చరిక.. ఎయిర్ పోర్టు మూసివేత.. టీమిండియా పరిస్థితి ?

Team India stuck in Barbados: వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ గెలుచుకున్న టీమిండియా ఆటగాళ్లు స్వదేశానికి రావడానికి మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నట్లు కనిపిస్తున్నాయి. హరికేన్ బెరిల్ తీవ్ర ప్రభావం కారణంగా హోటల్ రూమ్ నుంచి ఆటగాళ్లు బయటకురాలేదు. దీంతో రెండుమూడు రోజులు అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో రంగంలోకి బీసీసీఐ దిగింది.

- Advertisement -

అట్లాంటిక్ సముద్రంలో హరికేన్ బెరిల్ ఏర్పడింది. దీంతో ప్రభావంతో భయంకరమైన ఈదురు గాలులు అక్కడ వీస్తున్నాయి. దీని ప్రభావం బార్బడోస్ ఐలాండ్‌‌పై పడింది. గంటలకు 200 కిలోమీటర్ల పైగానే బలమైన గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం నుంచి బ్రిడ్జ్‌టౌన్‌లోని విమాన, బస్సు సర్వీసులను రద్దు చేసింది అక్కడి ప్రభుత్వం.

- Advertisement -

ALSO READ: టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా.. ప్రైజ్ మనీ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో టీమిండియా జట్టుకు సంబంధించి మొత్తం 70 మంది హోటల్‌కే పరిమితమయ్యారు. సిబ్బంది రాక రెండురోజులు ఆలస్యమయ్యే అవకాశాలున్నట్లు బీసీసీఐ వర్గాలు చెబుతున్నమాట. పరిస్థితుల గమనిస్తున్న బీసీసీఐ, వాతావరణం కాస్త కుదుటపడిన తర్వాత బయలు దేరాలని ఆలోచన చేస్తోంది. తొలుత బార్బడోస్ నుంచి న్యూయార్క్‌కు టీమిండియా వెళ్లనుంది. అక్కడి నుంచి ఎమిరేట్స్ విమానంలో ముంబైకి రావాలని ప్లాన్ చేసింది.

కానీ.. బార్బడోస్ కు భారీ తుపాను హెచ్చరికలు చేసింది వాతావరణశాఖ. దీంతో అధికారులు అక్కడ కర్ఫ్యూ విధించారు. పరిస్థితులు అదుపులోకి వచ్చే వరకూ కర్ఫ్యూ కొనసాగనుంది. తుపాను ముప్పు నేపథ్యంలో బార్బడోస్ ఎయిర్ పోర్టును మూసివేశారు.

హరికేన్, తుపాను హెచ్చరికల కారణంగా టీమిండియా ఆలోచనలో పడింది. బీసీసీఐ సెక్రటరీ, అధ్యక్షుడు కూడా అక్కడే ఉండటంతో అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ఆటగాళ్లు, వారి ఫ్యామిలీ మెంబర్స్ అంతా చూస్తే దాదాపు 70 మంది ఉన్నారు. అటు బీసీసీఐ అధికారులు అమెరికా విమాన రంగ సంస్థలతో మాట్లాడుతున్నారు. బ్రిడ్జిటౌన్ నుంచి నేరుగా ఢిల్లీకి చార్డెర్ట్ విమానంలో స్వదేశానికి చేరుకునేలా మంతనాలు సాగిస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే రెండున మిస్సయితే మూడున కచ్చితంగా టీమిండియా ఆటగాళ్లు స్వదేశానికి చేరుకునే అవకాశముంది. కానీ తుపాను ప్రభావం తగ్గితేనే గానీ విమానాలు ఎగిరే అవకాశం లేకపోతే మాత్రం.. స్వదేశానికి టీమిండియా రాక మరింత ఆలస్యం కానుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News