Big Stories

Suryakumar Yadav miraculous catch: చరిత్రలో నిలిచిపోయేలా.. టీమిండియా గెలుపులో ఆ క్యాచ్‌దే..

Team india player Suryakumar miraculous catch: దాదాపు దశాబ్దమున్నర తర్వాత టీ ‌20 ప్రపంచకప్‌ను టీమిండియా గెలుచుకుంది. ఈ గెలుపులో ఆటగాళ్లంతా భాగస్వామ్యులయ్యారు. ఇది ఫలానా వ్యక్తి వల్లే భారత్ జట్టు విజయం సాధించిందని చెప్పలేము. ఆటగాళ్లు ఎవరి పాత్రను వాళ్లు పోషించారు. ఒక విధంగా చెప్పాలంటే టీమ్ విక్టరీ. కలిసికట్టుగా ఆడితే ఎలాంటి విజయాన్నైనా సొంతం చేసుకునేందుకు ఇదో ఉదాహరణ.

- Advertisement -

బ్రిడ్జిటౌన్ వేదికగా టీ 20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ దక్షిణాఫ్రికా-టీమిండియాల మధ్య జరిగింది. ఆఖరి ఓవర్ వరకు మ్యాచ్ టెన్షన్‌గా మారింది. చివరి ఓవర్లో సౌతాఫ్రికా విజయానికి కేవలం 16 పరుగులు మాత్రమే అవసరం. 20వ ఓవర్‌లో బౌలింగ్‌కు దిగిన హార్దిక్ పాండ్యా వేసిన తొలి బాల్‌కు మిల్లర్ గాల్లోకి లేపాడు. దాదాపు అది సిక్స్‌‌ వైపు వెళ్లేలా కనిపించింది. అది బౌండరీ దాటి బయట పడితే ఫలితం మరోలా ఉండేది.

- Advertisement -

లాంగాఫ్ నుంచి మెరుపు వేగంతో పరుగెత్తిన సూర్య ఒక్కసారి బంతిని అందుకున్నాడు. కానీ నియంత్రణ కోల్పోయి బౌండరీ లైన్ దాటేశాడు. ఆ సమయంలో బంతిని గాల్లోకి విసిరాడు. తిరిగి వచ్చి ఆ బంతిని అందుకుని జట్టును ఆనందంలో ముంచెత్తాడు. సూర్యకుమార్ పట్టిన ఈ క్యాచ్ జట్టు విజయంలో కీలక పాత్ర అయ్యింది.

ALSO READ: విశ్వవిజేతగా భారత్.. ఉత్కంఠపోరులో చతికిలపడ్డ సఫారీలు..

ప్రపంచకప్‌లు ఇలాంటివి జ్ఞాపకాలు టీమిండియాకు ఎక్కువగానే ఉంటాయి. 2007 టీ20 ప్రపంచకప్‌లో అప్పటి కేరళ స్పీడ్‌స్టార్ శ్రీకాంత్ క్యాచ్ ఆ కోవలోకి చెందుతుంది. 2011 ప్రపంచకప్‌లో ధోని కొట్టిన సిక్స్ భారత క్రికెట్‌లోనే ప్రపంచకప్‌లోనూ చెప్పకోదగినవి.

 

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News