Big Stories

Ravi Shastri Celebrate 1983 World Cup Win: తొలి కప్ గెలిచి 41 ఏళ్లు.. వెస్టిండీస్‌లో మాజీల సెలబ్రేషన్స్..!

Ravi Shastri Celebrate 1983 World Cup Victory: టీమిండియా తొలి ప్రపంచకప్ గెలిచి 41 ఏళ్లు పూర్తి అయ్యాయి. జూన్ 25, 1983 భారత క్రికెట్ చరిత్రలో మరచిపోలేని రోజు. కెప్టెన్ కపిల్‌దేవ్ నేతృత్వంలో భారత జట్టు లార్డ్స్ మైదానంలో ఒక అద్భుతాన్ని ఆవిష్కరించింది. బలమైన వెస్టిండీస్‌ను ఫైనల్‌లో మట్టి కరిపించి ప్రపంచకప్‌ను అందుకుంది కపిల్‌దేవ్ సేన.

- Advertisement -
Team India ex cricketers
Team India ex cricketers

టీ 20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో బిజీగా ఉన్నారు టీమిండియా మాజీ ఆటగాళ్లు. ఈ సందర్భంగా వెస్టిండీస్‌లోని ఓ హోటల్‌లో మాజీ ఆటగాడు రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్, బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ ఆధ్వర్యంలో రోహిత్ టీమ్‌తో కలిసి సంబరాలు చేసుకున్నారు. ప్రపంచకప్ గెలిచి 41 ఏళ్ల సందర్భగా కేక్ కట్ చేసి ఎంజాయ్ చేశారు.

- Advertisement -

Also Read: IND vs ENG T20 WC 2024 Weather Update: టీమ్ ఇండియా సెమీఫైనల్ కి.. వర్షం ఆటంకం?

A day that changed the face of Indian cricket
A day that changed the face of Indian cricket

దీనికి సంబంధించిన ఫోటోలను రవిశాస్త్రి క్రికెట్ అభిమానులతో షేర్ చేసుకున్నారు. ప్రపంచ‌కప్ గెలిచి 41 ఏళ్లు, భారత క్రికెట్ ముఖాన్ని శాశ్వతంగా మార్చిన రోజు, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ చిన్న క్యాప్షన్ ఇచ్చేశారాయన.

Also Read: Sunil Gavaskar : మీరు ఏమనుకుంటున్నారు?.. బ్రాడ్ కాస్టర్ పై గవాస్కర్ ఆగ్రహం

Team India ex cricketers Ravi Shastri celebrate 1983 WC win
Team India ex cricketers Ravi Shastri celebrate 1983 WC win

1983 తర్వాత భారత క్రికెట్‌ను సమూలంగా మార్చిన రోజు. భారత క్రికెట్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన ఘట్టం అది. ఎలాంటి అంచనాలు లేకుండా ఇంగ్లాండ్‌‌‌పై అడుగుపెట్టిన టీమిండియా జట్టు, అద్భుతమైన ఆటతీరుతో ప్రపంచకప్ విజేతగా నిలిచింది. అప్పటికే రెండుసార్లు ప్రపంచకప్ గెలిచింది వెస్టిండీస్‌. ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ విండీస్‌ను మట్టి కరిపించి విజేతగా నిలిచింది టీమిండియా.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News