Big Stories

Taliban Thanks to BCCI: సెమీస్‌కి అఫ్గాన్ జట్టు.. బీసీసీఐకి థ్యాంక్స్ చెప్పిన తాలిబన్లు!

Taliban Thanks to BCCI to reach Afghanistan Semis: టీ20 ప్రపంచకప్‌లో అఫ్గనిస్తాన్ సెమీస్‌కు చేరడంతో ఆ దేశంలో సంబరాలు అంబరాన్ని తాకాయి. రాజధాని కాబూల్‌లో ప్రజలు రోడ్లపైకి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. వేలాది మంది ఒకేచోట గుమ్మిగూడి తమ ఆనందాన్ని ఒకరితో మరొకరు పంచుకున్నారు. కొన్నాళ్లుగా తాము పడుతున్న బాధ, ఆవేదనను మర్చిపోయి క్రికెట్ గెలుపును ఆ దేశ ప్రజలు ఆస్వాదిస్తున్నారు.

- Advertisement -

ముఖ్యంగా టీ 20 ప్రపంచకప్‌లో అఫ్గాన్ జట్టు విజయం వెనుక కీలకపాత్ర పోషించిన బీసీసీఐకి కృతజ్ఞత‌లు చెప్పారు తాలిబన్ ప్రభుత్వ పెద్దలు. క్రికెట్‌లో అఫ్గాన్ జట్టుకు బీసీసీఐ చేస్తున్న కృషి మరువలేమని,మీరు అందిస్తున్న సాయానికి థ్యాంక్స్ చెప్పింది అక్కడి ప్రభుత్వం. తాము ఎప్పటికీ బీసీసీఐకి రుణపడి ఉంటామని, తమ జట్టు ఎదుగుదలకు అందించిన సహాయ సహకారాలు మరువలేమని పేర్కొన్నారు. దీనికి సంబంధించి మేసెజ్ నెట్టింట వైరల్ అయ్యింది. దీనిపై అందరూ చర్చించుకోవడం మొదలైంది.

- Advertisement -

అఫ్గాన్ జట్టు విషయంలో బీసీసీఐ కీలకపాత్ర పోషించింది. ఆ దేశంలో పరిస్థితుల కారణంగా అఫ్గాన్ ఆటగాళ్లు సొంత దేశానికి వెళ్లిన సందర్భాలు లేవు. ఇండియా, దుబాయ్ లాంటి దేశాల్లో ఎక్కువగా ఉంటున్నారు. దాదాపు దశాబ్దంగా అఫ్గాన్ ఆటగాళ్లకు భారత్‌లో ట్రైనింగ్, స్టేడియం సదుపాయాలను బీసీసీఐ కల్పిస్తోంది. అంతేకాదు ఐపీఎల్‌లో ఆ దేశ క్రికెటర్లు చాలామంది ఆడుతున్నారు.

Also Read: బంగ్లాదేశ్‌పై సంచలన విజయం, సెమీస్‌లో అఫ్గాన్, ఇంటికి ఆస్ట్రేలియా

తమ జట్టు సెమీస్‌లో అడుగుపెట్టినందుకు తాలిబాన్ విదేశాంగ మంత్రి ముత్తాఖీ కెప్టెన్ రషీద్‌ఖాన్‌కు ఫోన్ చేసి అభినందించారు. ఈ టోర్నమెంటులో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ వంటి జట్లను ఓడించి వారి చరిత్రలో తొలిసారి ఐసీసీ టోర్నమెంట్‌లో సెమీస్‌కు చేరింది ఆ జట్టు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News