Big Stories

T20 World Cup: భారత్‌కు తిరిగొచ్చిన రోహిత్ సేన..ఛాంపియన్స్‌కు ఘన స్వాగతం

 

- Advertisement -

T20 World Cup Champions: వరల్డ్ ఛాంపియన్స్ స్వదేశానికి చేరుకున్నారు. బెరిల్ తుఫాను కారణంగా వెస్టిండీస్ లో చిక్కుకుపోయిన భారత జట్టు ప్రత్యేక విమానంలో గురువారం 6 గంటలకు భారత్‌ గడ్డకు చేరుకుంది. టీ20 ట్రోఫీతో వస్తున్న రోహిత్ సేనకు ఢిల్లీ విమానాశ్రయంలో అభిమానులు ఘనస్వాగతం పలికారు.

- Advertisement -

టీమిండియా ఆటగాళ్లు ముందుగా ప్రధాని నరేంద్ర మోదీని కలువనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. అక్కడే బ్రేక్ పాస్ట్ చేయనున్నారు. అనంతరం ప్రత్యేక విమానంలో ముంబైకు పయనమవుతారు.

ఎయిర్ పోర్టు నుంచి వాంఖడే స్టేడియం వరకు ఓపెన్ బస్ ఉండనుంది.  సాయంత్రం 5 గంటలకు ముంబైలో ఆటగాళ్లు రోడ్ షోలో పాల్గొంటారు. రాత్రి వాంఖడేలో బీసీసీఐ భారత జట్టును సన్మానించనుంది.

ప్రపంచ కప్ గెలిచిన టీమిండియాకు గౌరవంగా నిర్వహిస్తున్న విక్టరీ పరేడ్‌లో పాల్గొనాలని బీసీసీఐ కార్యదర్శి జై షా పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విక్టరీ పరేడ్‌లో క్రికెట్ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు బీసీసీఐ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది.

అంతకుముందు స్వదేశానికి రాక ముందు ప్రత్యేక విమానంలో టీమిండియా సందడి చేసింది. బెరిల్ తుఫాన్ ప్రభావంతో అక్కడే ఉండిపోయిన టీమిండియా ఆటగాళ్ల కోసం బీసీసీఐ ప్రత్యేక ఎయిర్ పోర్టు కేటాయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా విమానంలో టీ20 ట్రోఫీతో సెల్ఫీలు, ఫోటోలకు ఫోజులిస్తూ హర్షం వ్యక్తం చేశారు.

వాంఖడేలో సన్మానం అనంతరం బీసీసీఐ ప్రకటించిన రూ.125 కోట్ల నగదు బహుమతిని జట్టు సభ్యులకు అందించనున్నారు. విక్టరీ పరేడ్ తర్వాత బీసీసీఐ కార్యాలయంలో టీ20 వరల్డ్ కప్-2024 ట్రోఫీని ఉంచనున్నారు. ప్రముఖుల అభినందనల తర్వాత రాత్రి వరకు ఈ కార్యక్రమాలు ముగియనున్నాయి.

టీమిండియా జట్టు స్వదేశానికి చేరుకున్న తర్వాత ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి మౌర్య హోటల్‌కు వెళ్లారు. అక్కడ గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పారు. ఈ మేరకు హోటల్ చేరుకున్న వెంటనే అక్కడ భారత ఆటగాళ్లు డ్యాన్స్ చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, యశస్వీ జైశ్వాల్, పంత్ డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News