Big Stories

Afghanistan enter Super 8: ఆప్ఘన్ చేతిలో చిత్తయిన పపువా న్యూగినియా, సూపర్ 8లోకి ఎంటర్, కివీస్ ఔట్..

Afghanistan enter Super 8: టీ20 ప్రపంచకప్‌ 2024 టోర్నమెంట్‌లో సంచలనాలు నమోదు కంటిన్యూ అవుతున్నాయి. సూపర్- 8లోకి వెళ్తాయని భావిస్తున్న జట్లు అనూహ్యంగా డ్రాపవుతున్నాయి. తాజాగా గ్రూప్-సి నుంచి న్యూజిలాండ్ నిష్క్రమించింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పపువా న్యూగినియా పై ఏడు వికెట్ల తేడాతో నెగ్గింది ఆఫ్ఘనిస్తాన్. ఈ విజయంతో సూపర్ ఎయిట్‌లోకి ఎంటరైంది ఆ జట్టు.

- Advertisement -

ట్రినిడాడ్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్-పపువా న్యూగినియా మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత టాస్ గెలిచిన ఆఫ్ఘన్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన పీఎన్‌జీ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోర్ 12 పరుగులున్నప్పుడు కెప్టెన్ అసాద్ వాలా ఔటయ్యాడు. అక్కడి నుంచి ప్రారంభమైన వికెట్ల పతనం ప్రారంభమైంది. ఆ తర్వాత ఆ జట్టు ఏమాత్రం కోలుకోలేకపోయింది.

- Advertisement -

ఆప్ఘన్ బౌలింగ్ ముందు ఆ జట్టులోని 8 మంది ఆటగాళ్లు సింగిల్ డిజిట్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 19.5 ఓవర్లలో కేవలం 95 పరుగులు ఆ జట్టు ఆలౌటయ్యింది. 96 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగింది ఆప్ఘన్ జట్టు. 10 ఓవర్లలోపే కీలకమైన వికెట్లను కోల్పోయింది. వన్ డౌన్‌లో వచ్చిన గులాబి దిన్ నయూబ్ అద్భుతంగా రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అజ్మతుల్లా, మహ్మద్ నబీ తమ వంతు రాణించారు.

ALSO READ: 3.1 ఓవర్లలో గెలిచిన ఇంగ్లండ్ : పసికూన ఒమన్ విలవిల

కేవలం 15.1 ఓవర్లలోనే మూడు వికెట్ల నష్టపోయిన 101 పరుగులు చేసింది. దీంతో పపువా న్యూగినియాపై ఏడు వికెట్ల తేడాతో నెగ్గింది ఆఫ్ఘనిస్తాన్. ఈ విజయంతో సూపర్ 8లోకి అడుగుపెట్టేసింది. ఆప్ఘన్ విజయంతో న్యూజిలాండ్ ఇంటిదారి పట్టింది. గ్రూప్ -సీలో ఆప్ఘన్, వెస్టిండీస్, ఉగాండా, పపువా న్యూగినియా, న్యూజిలాండ్ ఉన్నాయి. మూడు మ్యాచ్‌ల్లో నెగ్గిన ఆప్ఘన్ జట్టు ఆరుపాయింట్లతో గ్రూప్‌లో టాపర్‌గా నిలిచింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News