Big Stories

T20 World Cup 2024 Super 8 Qualified Teams: సూపర్ 8కి చేరిపోయిన జట్లు ఇవే..!

T20 WC 2024 Teams Qualified for Super 8 Round from Group A, B, C, D: టీ 20 ప్రపంచకప్ లో సగం మ్యాచ్ లు అయిపోయాయి. నాలుగు గ్రూపుల్లో అప్పుడే కొన్ని జట్లు సూపర్ 8లో బెర్తులు కన్ ఫర్మ్ చేసుకున్నాయి. కొన్ని అటు ఇటుగా ఉన్నాయి. దశాబ్దాలుగా క్రికెట్ ఆడుతున్న పెద్ద జట్లు కొన్ని అప్పుడే ఇంటి దారి పట్టనున్నాయి. కొన్ని చిన్నజట్లు సూపర్ 8కి రానున్నాయి. మరి అవేమిటో నాలుగు గ్రూపుల వారీగా చూద్దాం.

- Advertisement -

గ్రూప్ ఏలో..

- Advertisement -

ఇండియా, పాకిస్తాన్, అమెరికా, కెనడా, ఐర్లాండ్ జట్లు ఉన్నాయి. ఇక్కడందరికీ తెలిసిన విషయం ఏమిటంటే టీమ్ ఇండియా 6 పాయింట్లతో సూపర్ 8 కి క్వాలిఫై అయ్యింది. వెనుక అమెరికా రెడీగా ఉంది. తను ఐర్లాండ్ తో ఒక మ్యాచ్ ఆడాల్సి ఉంది. అక్కడ ఖచ్చితంగా గెలిచేలా ఉంది. ఎందుకంటే పాక్ ని ఓడించింది, ఇండియాని వణికించింది. అందువల్ల తప్పనిసరిగా సూపర్ 8కి వెళ్లేందుకు అమెరికాకి అవకాశాలు ఉన్నాయి.

ఇక పాకిస్తాన్ 2 పాయింట్లతో ఉంది. ఆడాల్సిన మ్యాచ్ ఒక్కటే ఉంది. అందువల్ల 4 పాయింట్లు వచ్చినా కష్టమే కానీ, ఐర్లాండ్ తో అమెరికా ఓడిపోతే మాత్రం, రెండు జట్లు నాలుగు పాయింట్లతో ఉంటాయి. ఇంక కెనడా 3 మ్యాచ్ లు ఆడి, 1 గెలిచి, 2 ఓడిపోయింది. ప్రస్తుతం 2 పాయింట్లతో ఉంది. ఆ ఒక్క మ్యాచ్ ఇండియాతో ఉంది. ఇక్కడ గెలిస్తే మొత్తం మూడు జట్లు 4 పాయింట్లతో ఉంటాయి. అప్పుడు నెట్ రన్ రేట్ ఆధారంగా ఇందులో ఒక జట్టు సూపర్ 8కి చేరుతుంది.

గ్రూప్ బిలో..

ఆస్ట్రేలియా, స్కాట్లాండ్, ఇంగ్లాండ్, నమీబియా, ఒమన్ ఉన్నాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా 6 పాయింట్లతో సూపర్ 8 కి చేరింది. తర్వాత స్కాట్లాండ్ 5 పాయింట్లతో ఉంది. ఇంగ్లాండ్ 1 పాయింట్ తోనే ఉంది. ఇంకా ఆడాల్సిన మ్యాచ్ లు 2 ఉన్నాయి. వాటిలో గెలవాలి. అప్పుడు తను 5 పాయింట్లతో ఉంటుంది. సఇక స్కాట్లాండ్ ఆడాల్సిన ఒక మ్యాచ్ ఓడిపోతే రన్ రేట్ ప్రకారం ముందున్న జట్టు సూపర్ 8కి వెళుతుంది.
నమీబియా 2 పాయింట్లతో ఉంది. ఇంక ఆడాల్సిన మ్యాచ్ ఒకటే ఉంది. గెలిచినా ఆ జట్టుకి దాదాపు అవకాశం లేనట్టే లెక్క. ఒమన్ 3 మ్యాచ్ లు ఆడి 3 ఓడిపోయింది.

గ్రూప్ సిలో..

వెస్టిండీస్, ఆఫ్గనిస్తాన్, ఉగండా, పపువా న్యూగినీ, న్యూజిలాండ్ ఉన్నాయి. వీటిలో ఆల్రడీ వెస్టిండీస్ 6 పాయింట్లతో సూపర్ 8కి చేరుకుంది. న్యూజిలాండ్ 2 మ్యాచ్ లకు 2 ఓడి, అట్టడుగున ఉంది. మరో రెండు గెలిచినా 4 పాయింట్లే వస్తాయి. ఆల్రడీ ఆఫ్గనిస్తాన్ 4 పాయింట్లతో ఉంది. తనింకా 2 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. తను ఒక్కటి గెలిచినా సూపర్ 8కి వెళ్లిపోతుంది. పపువా ఆడిన రెండు మ్యాచ్ లు ఓడిపోయింది. ఉగండా ఒకటి గెలిచి 2 పాయింట్లతో ఉంది. సూపర్ 8కి ఆఫ్గనిస్తాన్ చేరే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Also Read: పపువా న్యూగినియాని చిత్తు చేసి ఆఫ్గాన్, సూపర్ 8లోకి ఎంటర్, కివీస్ ఔట్..

గ్రూప్ డిలో..

సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్, శ్రీలంక ఉన్నాయి. ఇక్కడ ఆల్రడీ సౌతాఫ్రికా 6 పాయింట్లతో సూపర్ 8కి చేరింది. బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ 2 పాయింట్లతో ఉన్నాయి. నేపాల్, శ్రీలంక చెరొక పాయింట్లతో ఉన్నాయి. సూపర్ 8 కి చేరే రెండో జట్టు బంగ్లాదేశ్ లేదా, నెదర్లాండ్స్ వెళ్లే అవకాశాలున్నాయి.
ఎందుకంటే శ్రీలంక ఆల్రడీ 3 మ్యాచ్ లు ఆడేసి 1 పాయింట్ తోనే ఉంది. మరొకటి గెలిచినా 3 పాయింట్లే అవుతాయి. నేపాల్ పరిస్థితి అంతే ఉంది.

ఓవరాల్ గా చూస్తే..

నాలుగు గ్రూప్ ల నుంచి నేటికి పక్కాగా సూపర్ 8కి చేరిన నాలుగు జట్లు ఉన్నాయి.  అవి ఇండియా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, సౌతాఫ్రికా.. ఇక తప్పనిసరిగా గ్రూప్ దశ నుంచి ఇంటి దారి పట్టే పెద్ద జట్లు ఏవిటంటే న్యూజిలాండ్, శ్రీలంక కనిపిస్తున్నాయి.

ఇక పాకిస్తాన్, ఇంగ్లాండ్ అయితే తమ గ్రూప్ లో జట్ల గెలుపు ఓటములపై ఆధారపడి ఉన్నాయి.

పాకిస్తాన్ కి అయితే అమెరికా మరో మ్యాచ్ ఓడిపోవాలి. ఇంగ్లాండ్ కి అయితే స్కాట్లాండ్ ఓడిపోవాలి. అప్పుడు వీరు మంచి రన్ రేట్ తో గెలిస్తే అవకాశం ఉంటుంది. ఈ సమీకరణాలన్నీ ఒకట్రెండు రోజుల్లో తేలిపోనున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News