Big Stories

T20 World Cup 2024 Semi-Finals: రేపే రెండు సెమీఫైనల్స్.. టీమ్ ఇండియా వర్సెస్ ఇంగ్లండ్.. ఆఫ్గాన్ వర్సెస్ సౌతాఫ్రికా.. ఫైనల్ చేరేదేవరు..?

T20 World Cup 2024 Semi-Finals Match Ind Vs Eng and AFG Vs SA:  టీ 20 ప్రపంచకప్ లో సూపర్ 8 అంకం నరాలు తెగే ఉత్కంఠ మధ్య ముగిసింది. మొత్తానికి ఫైనల్ మ్యాచ్ లో రావాల్సిన క్లైమాక్స్ ముందే వచ్చినట్టయ్యింది. ఇక గురువారం నాడు రెండు సమీఫైనల్స్ ఒకేరోజు జరగనున్నాయి. తొలి సెమీఫైనల్ ఆప్గనిస్తాన్ వర్సెస్ సౌతాఫ్రికా మధ్య ట్రినిడాడ్ లో బ్రియాన్ లారా ఇంటర్నేషనల్ స్టేడియంలో ఉదయం 6 గంటలకు ప్రారంభం కానుంది.

- Advertisement -

ఇక రెండో సెమీఫైనల్ మ్యాచ్ టీమ్ ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ మధ్య గయానాలో సాయంత్రం 8 గంటలకు ప్రారంభం కానుంది. టీమ్ ఇండియా విషయానికి వస్తే, ఇదే స్క్వాడ్ ని కొనసాగిస్తారా? లేక మార్పులు-చేర్పులు చేస్తారా? అని సందేహాలు నెట్టింట వినిపిస్తున్నాయి. ఇంతవరకు ఈ రెండు జట్ల మద్య 23 టీ 20 మ్యాచ్ లు జరిగాయి. అందులో టీమ్ ఇండియా 12 సార్లు, ఇంగ్లండ్ 11 సార్లు విజయం సాధించాయి. అయితే మనదే ఒక చేయి పైన ఉంది.

- Advertisement -

ఆఖరుగా జరిగిన నాలుగు మ్యాచ్ లు చూస్తే, చెరో రెండు గెలిచాయి. ఇక్కడ మళ్లీ సమానమైంది. అంటే ఇంగ్లండ్ తో పోటీ పడటం అంటే టీమ్ ఇండియాకి అంత ఈజీకాదని అర్థమవుతోంది. రెండు జట్లు గెలుపోటముల్లో సమఉజ్జీలుగా ఉన్నాయి. శక్తులన్నీ సమీకరించి వందకి రెండొందల శాతం  టీమ్ ఇండియా ఆడాల్సి ఉంటుందని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.

Also Read: ఆఫ్గాన్ ఛీటింగ్ పై.. ఐసీసీ సీరియస్

ఇక గయానా పిచ్ విషయానికి ఇక్కడ ‘లో స్కోరు , హై స్కోరు’ మ్యాచ్ లు జరిగాయి. ఇదే టీ 20 ప్రపంచకప్ లో వెస్టిండీస్ 5 వికెట్ల నష్టానికి 173 చేసింది. ఉగండా 39 పరుగులకి ఆలౌట్ అయిపోయింది. 2010లో  ఇక్కడ హయ్యస్ట్ స్కోరు ఇంగ్లాండ్ చేసింది. వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది.

ప్రస్తుతం పిచ్ స్పిన్నర్లకు అనుకూలించేలా ఉంది. అందుకని ముగ్గురు స్పెషలిస్టు స్పిన్నర్లు కులదీప్, అక్షర్, రవీంద్ర జడేజాలను జట్టులో కంటిన్యూ చేసేలా ఉన్నారు. స్పిన్ పిచ్ లపై కూడా వికెట్లు తీసే బుమ్రా, అర్షదీప్ ఉండనే ఉన్నారు. బౌలింగు పరంగా మంచి వెపన్స్ మన వద్ద ఉన్నాయి. బ్యాటింగ్ పరంగా ఇంగ్లండ్ కి బాగుంది.

Also Read: SA vs AFG Highlights T20 WC 2024 Semifinal: తొలిసారి ఫైనల్ కి వెళ్లిన సౌతాఫ్రికా.. కీలక మ్యాచ్ లో ఓడిన ఆఫ్గాన్

సౌతాఫ్రికా వర్సెస్ ఆఫ్గనిస్తాన్ విషయానికి వస్తే.. ఇది ఏసీడీసీ మ్యాచ్ లా ఉంటుంది. ఆఫ్గనిస్తాన్ వరుసగా మ్యాచ్ లు గెలిచే సత్తా ఆ జట్టుకి లేదనే అంటున్నారు. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ లపై గెలిచింది. మరి అదే ఊపులో సౌతాఫ్రికాకి ఝలక్ ఇస్తుందా చూడాలి. మరొకవైపు సౌతాఫ్రికా జట్టుకి సెంటిమెంటుగా సెమీఫైనల్ మ్యాచ్ లు కలిసి రాలేదు. అలాగైనా అయితే ఓడిపోవాలి తప్ప, లేదంటే ఆఫ్గాన్ కి కష్టకాలమే అని చెప్పాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News