Big Stories

T20 World Cup 2024: క్రికెట్ అభిమానులకు షాక్.. సూపర్ 8 మ్యాచ్ లకు వర్షం అడ్డంకి..!

T20 World Cup 2024: టీ 20 ప్రపంచకప్ లో సూపర్ 8 మ్యాచ్ లు మరో రెండు రోజుల్లో వెస్టిండీస్ లో ప్రారంభం కానున్నాయి. ఈ మ్యాచ్ లకు ఆతిథ్యం ఇచ్చే నాలుగు ప్రాంతాలైన బార్బోడస్, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్, ఆంటిగ్వా అన్నిచోట్లా వర్షం ముప్పు పొంచి ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు(సీడబ్ల్యూఐ), ఐసీసీ ఆందోళన చెందుతున్నాయి.

- Advertisement -

ఈ నేపథ్యంలో ఐసీసీపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ముందుగా ఫోర్ కాస్ట్ తెలుసుకోకుండా ప్రపంచకప్ లాంటి మెగా టోర్నమెంటు ఎలా ప్లాన్ చేస్తారని అభిమానులు మండిపడుతున్నారు. ఇప్పుడు కాకపోతే మరో 3 నెలల తర్వాత చేస్తే.. మీ సొమ్మేం పోయింది? అని అడుగుతున్నారు. ఎక్కడికక్కడ డబ్బులు సొమ్ము చేసుకోవాలనే యావ తప్ప, మరొకటి లేదని నెటిజన్లు సీరియస్ అవుతున్నారు.

- Advertisement -

ఆర్థికంగా చితికిపోయిన వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు చేయుతనిచ్చేందుకు ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఆతిథ్య హక్కులను ఇచ్చింది. అలాగే ఈ టోర్నీ ద్వారా తమ ఆర్థిక సమస్యలు తీరుతాయని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు భావించింది. కానీ వారి ఆశలపై వరుణుడు నీళ్లు జల్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

భారత్ ఆడే.. మూడు మ్యాచ్ లకు వర్షం ముప్పు..

జూన్ 20న ఆఫ్గనిస్తాన్ తో మ్యాచ్

భారత్ వర్సెస్ అఫ్గానిస్థాన్ మధ్య బార్బోడోస్ లోని కెన్సింగ్టన్ ఓవల్‌ స్టేడియంలో జూన్ 20న మ్యాచ్ జరగనుంది. ఈ సమయంలో 10 నుంచి 15 శాతం వర్షం పడనుందని వాతావరణ శాఖ తెలిపింది.

జూన్ 22న బంగ్లాదేశ్ తో మ్యాచ్

ఆంటిగ్వాలోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇక్కడ 45 శాతం వర్షం పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

జూన్ 24న ఆస్ట్రేలియాతో మ్యాచ్

సెయింట్ లూసియాలోని డారెన్ సామీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగే భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించనుంది. 55శాతం వర్షం పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఒకవేళ ఈ మ్యాచ్ రద్దయితే ఇరు జట్లు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది.

గ్రూప్ దశలో వర్షాలకు తుడిచిపెట్టుకుపోయిన మ్యాచ్ లు

టీ 20 ప్రపంచకప్… గ్రూప్ దశలో కొన్ని మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. భారత్ వర్సెస్ కెనడా, ఇంగ్లండ్ వర్సెస్ స్కాట్లాండ్, యూఎస్‌ఏ వర్సెస్ ఐర్లాండ్ మ్యాచ్‌లు వర్షార్పణం అయ్యాయి.

వెస్టిండీస్ లో అవుట్ ఫీల్డ్ ను కాపాడే కవర్లు లేవు..

వెస్టిండీస్ లో ఆర్థిక వనరుల కారణంగా వర్షం పడే సమయంలో పిచ్‌ను మాత్రమే రక్షించగలుగుతున్నారు. అవుట్ ఫీల్డ్‌ను కవర్ చేసే కవర్లు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు వద్ద లేకపోవడం.. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం సమస్యగా మారింది.

అదే జరిగితే.. పెద్ద దేశాల తలరాతలు తారుమారు

నిజానికి వర్షం కారణంగా మ్యాచ్ లు రద్దు అయితే ఇరు జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. ఇంతటి మెగా టోర్నమెంటులో రిజర్వ్ డేస్ లేకుండా సూపర్ 8ని ప్లాన్ చేయడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితే వస్తే.. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా వంటి ప్రధాన జట్ల తలరాతలు మారనున్నాయి. సెమీస్ అవకాశాలు తారుమారయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News