Big Stories

T20 World Cup 2024: టీమిండియా సెమీస్ చేరాలంటే అలా జరగాల్సిందే..!

India Semi Final Chances in T20 World Cup 2024: టీ20 ప్రపంచ కప్ 2024 సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. టైటిల్ ఫేవరెట్ జట్లు గ్రూప్ దశలోనే ఇంటి ముఖం పట్టగా అనామక జట్లు సూపర్ 8 చేరాయి. ఇక సూపర్ 8 లోనూ గత ప్రపంచ కప్ విజేత ఆస్ట్రేలియాను పసికూన ఆఫ్గనిస్తాన్ కంగారు పెట్టించింది. కంగారూలపై సంచలన విజయం నమోదు చేసింది రషీద్ సేన.

- Advertisement -

ఈ విజయంతో సూపర్ 8 సెమీస్ రూపురేఖలు మారిపోయాయి. ఆస్ట్రేలియా గెలిచి ఉంటే ఇండియా, ఆసీస్ జట్లు దర్జాగా సెమీస్ చేరేవే.. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఒకసారి గ్రూప్ 1 పరిస్థితి పరిశీలిస్తే..

- Advertisement -

ఆడిన రెండు మ్యాచుల్లో విజయాలు సాధించి 4 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది టీమిండియా. రెండు మ్యాచుల్లో ఒక విజయం, ఒక ఓటమితో రెండు పాయింట్లతో ఆసీస్ జట్టు రెండో స్థానంలో నిలిచింది. ఒక విజయం, ఒక ఓటమితో ఆఫ్గనిస్తాన్ జట్టు మూడో స్థానంలో నిలిచింది. ఇక ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓటమి చవిచూసిన బంగ్లాదేశ్ చివరిదైన నాలుగో స్థానంలో నిలిచింది. ఇంకా ఒక్కోజట్టుకు ఒక మ్యాచ్ మాత్రమే మిగిలున్నా ఎవరు సెమీస్ చేరతారనేదానిపై స్పష్టత రాలేదు.

Also Read: AUS Vs IND T20 World Cup 2024 Live Updates: మరికాసేపట్లో ఆసీస్‌తో టీమిండియా సమరం.. వరుణుడు కరుణించేనా..?

టీమిండియా సెమీస్ చేరాలంటే..?

సూపర్ 8 లో భాగంగా టీమిండియా తన చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఇప్పటికే ఆసీస్ ఆఫ్గనిస్తాన్ మీద ఓడిపోయి సెమీస్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. ఇండియాతో జరిగే మ్యాచ్ కంగారూలకి చావోరేవో. అయితే ఈ మ్యాచ్‌లో ఇండియా గెలిస్తే దర్జాగా సెమీస్ చేరుతుంది. ఒకవేళ ఇండియా ఓడిపోతే ఇతర జట్ల ఫలితాల మీద ఆధారపడి ఉంటుంది.

ఇండియా ఆసీస్ చేతిలో ఓడిపోయి.. బంగ్లాదేశ్-ఆఫ్గనిస్తాన్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ గెలిస్తే ఇండియా సెమీస్ చేరుతుంది.

ఇండియా ఆసీస్ చేతిలో ఓడిపోయి.. బంగ్లాదేశ్-ఆఫ్గనిస్తాన్ మ్యాచ్‌లో ఆఫ్గనిస్తాన్ గెలిస్తే నెట్ రన్ రేట్ మీదే సెమీస్ బెర్తులు ఖరారవుతాయి. ఒకవేళ ఇండియా 41 పరుగుల తేడాతో ఓడిపోయి, ఆఫ్గనిస్తాన్ 83 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ మీద విజయం సాధిస్తే ఆఫ్గనిస్తాన్, ఆసీస్ జట్లు సెమీస్ చేరుతాయి.

Also Read: సూపర్ 8లో పాట్ కమిన్స్‌ రెండో హ్యాట్రిక్‌.. ఆసిస్ ను చిత్తు చేసిన అఫ్గానిస్థాన్‌..

ఇండియా ఆసీస్ మీద గెలిస్తే.. రెండో సెమీస్ బెర్త్ కోసం ఆఫ్గనిస్తాన్, కంగారూల మధ్య గట్టిపోటీ ఉంటుంది. బంగ్లాదేశ్-ఆఫ్గనిస్తాన్ మ్యాచ్‌లో ఆఫ్గనిస్తాన్ గెలిస్తే.. ఈ ఛాంపియన్ జట్టు ఇంటి బాట పట్టాల్సిందే. ఒకవేళ ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ గెలిస్తే ఆసీస్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్ జట్లు 2 పాయింట్లతో సమానంగా ఉంటాయి. అప్పుడు నెట్ రన్ రేట్ ఆధారంగా రెండో జట్టు సెమీస్ చేరుతుంది.

ఏదేమైనా కంగారూలపై ఆఫ్గనిస్తాన్ సాధించిన విజయం ఈ ప్రపంచ కప్‌కే హైలైట్ అని చెప్పొచ్చు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News