Big Stories

IND vs PAK: క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ఆ మ్యాచ్ రద్దయ్యే ఛాన్స్ ?

T20 World Cup 2024: క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైంది. టీ 20 ప్రపంచ కప్ సమరానికి రంగం సిద్ధమయింది. జూన్ 9న ఇండియా పాకిస్తాన్ మధ్య న్యూయార్క్ వేదికగా కీలక మ్యాచ్ జరగనుంది. చిరకాల ప్రత్యర్థులు తలపడుతున్న ఈ మ్యాచ్‌ను చూసేందుకు రెండు దేశాల్లోని క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచేస్తున్నారు. కానీ ఈ మ్యాచ్‌కు వాతావరణ శాఖ బ్యాడ్ న్యూస్ చెప్పింది.

- Advertisement -

ఆదివారం ఇండియా పాకిస్తాన్ మధ్య న్యూయార్క్ వేదికగా టీ20 మ్యాచ్ జరగనుండగా మ్యాచ్ జరిగే సమయంలో వర్షం కురిసే అవకాశం ఉందని అక్యూ వెదర్ వెల్లడించింది. అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 10.30 గంటలకు అంటే ఇండియాలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్‌లో టాస్ వేసే సమయంలో 40-50 శాతం వర్షం పడే అవకాశం ఉన్నట్లు వెదర్ రిపోర్టు వెల్లడించింది.

- Advertisement -

అంతే కాకుండా వర్షం మధ్యాహ్నం 1 గంట అయ్యే సమయానికి 10 శాతం తగ్గి.. తర్వాత 3 గంటలకు 40 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఒక వేళ వర్షం పడితే వర్షం కారణంగా చెరో ఫాయింట్ వస్తుంది. ఒకవేళ మ్యాచ్ సమయంలో వర్షం పడితే ఎంతో కాలంగా ఎదరుచూస్తున్న క్రికెట్ అభిమానుల ఆశలు మాత్రం అడియాశలు అయినట్లే.

ఇండియా, పాకిస్తాన్ మెగా ఫైట్‌లో భాగంగా దాయాదుల మధ్య జరిగే ఈ పోరులో విరాట్ కోహ్లీయే ఓపెనర్ గా రానున్నట్లు స్పష్టమైపోయింది. ఐర్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో కోహ్లీ ఈ స్థానంలో విఫలం అయినా .. విరాట్‌నే కొనసాగించాలని టీం భావిస్తోంది. ఐపీఎల్ 2024లో అత్యధిక పరుగులు చేసిన కోహ్లీని టీ20 వరల్డ్ కప్‌లోనూ ఓపెనింగ్ చేయిస్తారని ఎప్పటినుంచో అనుకున్నారు. అయితే అందుకు తగ్గట్లుగానే ఐర్లాండ్‌తో తొలి మ్యాచ్‌లో అతన్నే రోహిత్‌తో కలిసి ఓపెనర్‌గా దించారు. అయితే కోహ్లీ మాత్రం ఈ మ్యాచ్ లో దారుణంగా విఫలం అయ్యాడు.

Also Read: పాకిస్తాన్‌తో కీలక మ్యాచ్.. ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. హిట్ మ్యాన్‌కు గాయం

ఇప్పుడు పాక్‌తో జరుగనున్న కీలకమైన మ్యాచ్‌లో తిరగి మూడో స్థానంలో పంపిస్తారా అన్నసందేహాలు వ్యక్తం అవుతున్న సమయంలో అలాంటిదేమీ లేదని టీం మేనేజ్మెంట్ తెలిపింది. ఈ మ్యాచ్‌లోనూ రోహిత్,  కోహ్లీయే ఓపెనర్లుగా వస్తారని విక్రమ్ రాథోడ్ వెల్లడించాడు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News