Big Stories

T20 Champions to India : స్వదేశానికి టీమిండియా.. రాత్రికి ఢిల్లీ చేరుకోనున్న రోహిత్ సేన

India cricket team latest news(Live sports news): బార్బడోస్‌ నుంచి ఈరోజు రాత్రి ఏడు గంటల 45 నిమిషాలకు టీమిండియా ఢిల్లీ చేరుకోనుంది. హరికేన్‌ ప్రభావం తగ్గడంతో నిన్న సాయంత్రం 6 గంటలకు ప్రత్యేక విమానంలో బార్బడోస్‌ నుంచి బయలు దేరారు. టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ బార్బడోస్‌లో జరిగింది. ఫైనల్ లో సౌతాఫ్రికాపై భారత్ ఘన విజయం సాధించింది. వరల్డ్ కప్ తో రోహిత్ సేన స్వదేశానికి ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ప్రతి క్రికెట్ అభిమాని ఎదురుచూస్తున్నాడు. కానీ.. ఇంతలోనే బార్బడోస్‌‌లో గాలివాన బీభత్సం సృష్టించింది.

- Advertisement -

నిజానికి జూన్ 29న మ్యాచ్ గెలిచిన టీమిండియా.. ఆ మరుసటి రోజునే భారత్ కు తిరిగి రావలసి ఉంది. కానీ.. హరికేన్‌ తీవ్రత కారణంగా విమానాశ్రయం మూసివేయడంతో భారత జట్టు అక్కడ చిక్కుకుంది. టీమిండియా బస​ చేసిన హోటల్‌లో నీరు, విద్యుత్‌ సరఫరా బంద్‌ అయింది. దీంతో మనవాళ్లు తీవ్రంగా ఇబ్బంది ప్డారు. మరోవైపు బార్బడోస్‌‌లో కర్ఫ్యూ అమల్లో ఉండటంతో.. మన ఆటగాళ్లంతా హోటల్‌కే పరిమితమయ్యారు. ఆ హోటల్ లో కూడా త్రాగునీరు, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగినట్లు వార్తలొచ్చాయి. టీమిండియా కింగ్ కోహ్లీ.. తన భార్య అనుష్క శర్మకు హరికేన్ ప్రభావం ఎలా ఉందో వీడియో కాల్ లో చూపించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.

- Advertisement -

Also Read : సీనియర్స్ రిటైర్మెంట్.. నెక్ట్స్ టీ20 పగ్గాలు ఎవరికి?

శుక్రవారం హరికేన్ల ప్రభావం తగ్గడంతో ప్రత్యేక విమానంలో స్వదేశానికి బయలుదేరారు. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ, కార్యదర్శి జై షా సైతం టీమిండియా ఆటగాళ్లతో పాటు బార్బడోస్ లోనే ఉన్నారు. ఇప్పుడు వారితో కలిసి స్వదేశానికి పయనమయ్యారు. మరోవైపు టీమిండియా రాక కోసం స్వదేశంలో అభిమానులు కళ్లలో వత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తున్నారు. 2011 తర్వాత వరల్డ్ కప్ విజేతగా నిలిచిన టీమిండియా ఘనంగా స్వాగతం పలికి సత్కారాలు చేసేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేసింది.

1983లో కపిల్ దేవ్ కెప్టెన్సీలో వన్ డే వరల్డ్ కప్, 2007లో ధోనీ ఆధ్వర్యంలో టీ20 వరల్డ్ కప్, 2011లో ధోనీ కెప్టెన్సీలో వన్ డే వరల్డ్ కప్ సాధించింది టీమిండియా. మళ్లీ 13 ఏళ్ల తర్వాత రోహిత్ కెప్టెన్సీలో టీమిండియా వరల్డ్ కప్ సాధించడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఎన్నాళ్లుగానో కలగానే మిగిలిన వరల్డ్ కప్ స్వదేశానికి వస్తుండటంతో.. క్రికెట్ అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు. బాణసంచా కాల్చి పండుగ చేసుకున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News