Big Stories

T20 Blast 2024: క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. ఔట్‌ను నాటౌట్‌గా ప్రకటించిన అంపైర్!

T20 Blast 2024: టీ20 బ్లాస్ట్‌ క్రికెట్ టోర్నీలో విచిత్రకర సంఘటన చోటుచేసుకుంది. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో క్రికెట్ చరిత్రలోనే తొలిసారి ఔట్‌ను నాటౌట్‌గా ప్రకటించారు. యార్క్ షైర్, లాంక్షైర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో యార్క్ షైర్‌కు కెప్టెన్‌గా ఉన్న పాకిస్తాన్ ఆటగాడు షాన్ మసూద్.. ఒకే బంతికి హిట్ వికెట్‌తో పాటు రనౌట్ అయ్యాడు. కానీ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు.
యార్క్ షైర్ ఇన్నింగ్స్ 15వ ఓవర్‌లో భ్లాథర్విక్ బౌలింగ్‌లో మూడో బంతిని షాన్ మసూద్ రివర్స్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బ్యాలెన్స్ కోల్పోయిన మసూద్.. తన కాలు స్టంప్స్‌కి తగలడంతో బెయిల్స్ కిందపడ్డాయి.
అంతే కాకుండా రన్ తీసుకునేందుకు మసూద్ పరిగెత్తుకుంటూ వెళ్లగా.. అంతలోనే అంపైర్ నోబాల్ ఇచ్చాడు. ఈ సమయంలో బంతిని అందుకున్న ఫీల్డర్లు రనౌట్ చేశాడు. దీంతో రనౌట్ అనుకొని మసూద్ నిరాశ చెందాడు.అయితే పీల్డ్ అంపైర్ మాత్రం నాటౌట్‌గా సిగ్నల్ ఇవ్వడంతో అందరూ గందరగోళానికి గురయ్యారు.
అంపైర్ నాటౌట్‌గా ప్రకటించడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. ఏంటి ఔట్‌ను నాటౌట్‌గా ఇవ్వడం ఏంటి? అని కాసేపు సందిగ్ధంలో పడిపోయారు. అయితే మెరిలిన్ క్రికెట్ బోర్డు నిబంధనల ప్రకారం మసూద్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.
ఎంసీసీ రూల్ 31.7 ప్రకారం.. అంపైర్ ఔట్ ఇవ్వకుండా బ్యాటర్ తనంతన తానే ఔట్ అయినట్లు తప్పుగా భావిస్తే..అంపైర్ తన విచక్షణ అధికారాన్ని ఉపయోగించి నాటాట్‌గా ఇవ్వొచ్చు. మసూద్ ఈ విషయంలో తన హిట్ వికెట్ అయ్యాడని భావించి రన్ కోసం పరిగెత్తి మధ్యలో ఉండిపోయాడు. అయితే ఉద్దేశపూర్వకంగా మసూద్ అలా చేయలేదని అంపైర్ భావించి నాటాట్‌గా ప్రకటించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News