Big Stories

Gautam Gambhir on T20 Format: టీ 20 అంటే ఫియర్ లెస్ క్రికెట్: గౌతం గంభీర్!

T 20 is a Fearless Cricket Game Says Gautam Gambhir: ఐపీఎల్ లో క్వాలిఫైయర్ 2 లో గెలిచిన హైదరాబాద్ జట్టుని ఉద్దేశించి కోల్ కతా మెంటార్ గౌతం గంభీర్ మాట్లాడుతూ.. టీ 20 అంటే ఫియర్ లెస్ గేమ్ అని అన్నాడు. అది కరెక్టుగా ఆడుతున్న జట్టు ఏదైనా ఉందంటే హైదరాబాద్ సన్ రైజర్స్ అని తెలిపాడు. ఒకవైపు నుంచి వికెట్లు పడుతున్నా, మరోవైపు ఓటములు వస్తున్నా ఎక్కడా వారు గేమ్ ప్లాన్ మార్చలేదు. గెలిస్తే గెలిచాం, లేదంటే లేదు అన్నట్టే ఆడారు. అదే వారిని నేడు ఫైనల్ వరకు తీసుకువచ్చిందని అన్నాడు.

- Advertisement -

ఆ మొండితనం అన్ని జట్లలో కూడా ఉందని అన్నాడు. ఈరోజున పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ స్థానంలో ఉన్న జట్టుకి, నెంబర్ 10లో ఉన్న జట్టుకి పెద్ద తేడా లేదని అన్నాడు. ఇక్కడ ఎవరూ గొప్పకాదని అన్నాడు. అయితే ఆర్సీబీ కూడా అలాగే ఆడి ప్లే ఆఫ్ వరకు వచ్చిందని అన్నాడు. కాకపోతే ఎలిమినేటర్ మ్యాచ్ లో ఆ ఫార్ములా వర్కవుట్ కాలేదని, ఒకవైపు వికెట్లు పడుతున్నా కూడా అదే దూకుడుగా ఆడటం సరికాదని అన్నాడు. నాకౌట్ మ్యాచ్ ల్లో .. ఆ టెంపోని కొద్దిగా డౌన్ చేస్తే బాగుండేదని అన్నాడు.

- Advertisement -

అయితే ఆ క్షణం మైదానంలో తీసుకునే నిర్ణయాలపైనే అంతా ఆధారపడి ఉంటుందని అన్నాడు. ఒక క్యాచ్ డ్రాప్ కావచ్చు.. రాంగ్ స్పెల్ కావచ్చు, ఫీల్డింగ్ సెటప్ కావచ్చు.. ఇలా ఎన్నో ఫ్యాక్టర్లు పనిచేస్తుంటాయి. ఏ నిమిషంలో ఏం జరుగుతుందో ఎవరం చెప్పలేమని, అంతా క్షణాల్లో కళ్ల ముందు జరిగిపోతుంటుందని అన్నాడు. ఎంతటి గొప్ప టీమ్ కి అయినా ఓటమి భయం ఉంటుంది, అది నిరంతరం గ్రౌండులో వెంటాడుతూ ఉంటుందని అన్నాడు. దానికి ఎవరూ అతీతులు కారని అన్నాడు.

Also Read: జోస్ బట్లర్ మెరుపు, బాబర్ సేనకు ఝలక్

ఇకపోతే హైదరాబాద్ సన్ రైజర్స్ గురించి మాట్లాడుతూ ఆ జట్టులో బ్యాటింగ్ మాత్రమే లేదు, బౌలింగులో కూడా బలంగా ఉందని అన్నాడు. క్రికెట్ లో అటు బ్యాటింగు, ఇటు బౌలింగు కూడా బాగుంటేనే ఫలితాలు సానుకూలంగా వస్తాయని అన్నాడు. ఇప్పుడు స్పిన్నర్లతో వారి బలం మరింత పెరిగిందని అన్నాడు. ముఖ్యంగా భువనేశ్వర్, కమిన్స్, నటరాజన్ పేసర్ల కాంబినేషన్ బాగుందని అన్నాడు. ఫైనల్ మ్యాచ్ కోసం కోల్ కతా వ్యూహాలకు మరింత పదును పెట్టాల్సిందేనని అన్నాడు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News