Big Stories

Sunil Gavaskar: మీరు ఏమనుకుంటున్నారు..? బ్రాడ్ కాస్టర్ పై గవాస్కర్ ఆగ్రహం!

Sunil Gavaskar Angry on Star Sports: టీ 20 ప్రపంచకప్ సూపర్ 8లో ఆస్ట్రేలియాపై రోహిత్ శర్మ ఆడిన అద్భుత ఇన్నింగ్స్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. తను కేవలం 41 బంతుల్ల 92 పరుగులు చేసి లెఫ్టార్మ్ పేసర్  స్టార్క్ బౌలింగులో బౌల్డ్ అయ్యాడు. అయితే మ్యాచ్ జరిగినప్పుడు అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ చేసిన అత్యుత్సాహంపై కామెంటేటర్ గా ఉన్న సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు.

- Advertisement -

రోహిత్ అవుట్ అయినప్పుడు, బ్రాడ్ కాస్ట్ సంస్థ పదే పదే ఒక గ్రాఫిక్ ను చూపించింది. అదేమిటంటే ఓపెనర్ రోహిత్ శర్మ ఎడమచేతి వాటం పేసర్ల బౌలింగులో ఎక్కువగా అవుట్ అయినట్టు పేర్కొంది. ఏదో ఒకసారి చూపిస్తే, సరిపోయేదానికి అదేపనిగా ఒకే గ్రాఫిక్ చూపించడంతో గవాస్కర్ కి మండిపోయింది. కామెంటేటర్ బాక్స్ నుంచి, అక్కడే ఉన్న మైక్ లో బ్రాడ్ కాస్టర్ కి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. అసలు ఏం అనుకుంటున్నారు? మా రోహిత్ గురించి.. అని మండిపడ్డాడు.

- Advertisement -

ఇంత గొప్పగా ఆడితే, ఆ సిక్స్ లు, ఫోర్లు చూపించకుండా అవుట్ అయిన విషయాన్ని పదేపదే చూపిస్తున్నారు. అది కూడా ఎడం చేతి బౌలర్ చేతిలో అవుట్ కావడాన్ని, రోహిత్ వీక్ నెస్ గా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారా? లేక బౌలర్లకి సందేశం ఇస్తున్నారా? అని సీరియస్ అయ్యాడు.

Also Read: టీ 20 ర్యాంకులో వెనుకపడ్డ సూర్యకుమార్ యాదవ్..

అయితే తన పక్కనే మరో కామెంటేటర్ ఆస్ట్రేలియాకి చెందిన మాజీ ప్లేయర్ ఆరోన్ ఫించ్ ఉన్నాడు. తను మధ్యలో కల్పించుకుని సర్ది చెప్పడానికి ప్రయత్నించాడు. ఆ గ్రాఫిక్ సరైందే, ఇప్పుడు ప్రతి జట్టులో చాలామంది ఎడం చేతి పేసర్లు ఉన్నారు, వారి నుంచి భారత్ ఓపెనర్ కు సవాల్ తప్పడం లేదు అని చెప్పాడు. అయితే గవాస్కర్ దాన్ని కొట్టి పారేశాడు. మరి ఇదే రోహిత్ 92 పరుగులు ఎలా చేశాడని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.

ఇదిలాఉండగా అసలు రేపు సెమీఫైనల్ లో  టీమ్ ఇండియా తలపడే ఇంగ్లాండ్ జట్టులో ఎంతమంది లెఫ్టార్మ్ పేసర్లున్నారని నెటిజన్లు అప్పుడే వెతికేస్తున్నారు. రీస్ టోప్లీ (లెఫ్టార్మ్ పాస్ట్ బౌలర్) , టామ్ హార్ట్ లీ ( స్లో లెఫ్టార్మ్ పేసర్), శామ్ కర్రన్ ( లెఫ్టార్మ్ మీడియం ఫాస్ట్) ముగ్గురు కనిపిస్తున్నారు. వాడెందుకు చూపించాడో ఏమో, కొంచెం జాగ్రత్తగా ఆడమని కెప్టెన్ రోహిత్ కి నెటిజన్లు సూచిస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News