Big Stories

IND vs SA Final Match : కత్తుల కొనలకు.. కత్తెర కొనలకు యుద్ధం.. సై

IND vs SA Final Match update(Cricket news today telugu) : కత్తుల కొనలకు.. కత్తెర కొనలకు యుద్ధం.. సై. నితిన్ నటించిన సై సినిమాలో రబ్బీ ఆటకోసం వచ్చే పాటకు ఓ లిరిక్ రైటర్‌ రాసిన ఈ పదాలు ఆప్ట్‌గా సూటవుతాయి ఇండియా అండ్ సౌతాఫ్రియా క్రికెట్ టీమ్స్‌కి. ఓటమనేదే ఎరుగకుండా ఫైనల్స్‌కు దూసుకొచ్చిన టీమ్ ఒకరిది. టీ20 వరల్డ్ కప్‌ చరిత్రలో తొలిసారి ఫైనల్స్‌ బెర్త్‌ దక్కించుకున్న టీమ్ మరొకరిది. హైలైట్ ఏంటంటే.. ఈ రెండు టీమ్స్‌ ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌ ఓడిపోలేదు. మరి ఫైనల్స్‌లో గెలిచేదెవరు? వరల్డ్‌కప్‌ను ముద్దాడేందుకు ఏ టీమ్‌కు ఎంత ఛాన్స్ ఉంది?

- Advertisement -

అంచనాలు నిజమవుతున్నాయి.. మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. రోహిత్‌ సేన ఈసారి వరల్డ్‌కప్‌ను ముద్దాడుతుందన్న నమ్మకం బలపడింది. అటు బ్యాటింగ్‌, ఇటు బౌలింగ్‌లో.. మొత్తంగా ఆల్‌రౌండ్ పెర్ఫామెన్స్‌తో దుమ్ముదులుపుతోంది టీమ్ ఇండియా. ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌ను చేజార్చుకోకుండా ఫుల్ స్టడీ అండ్ కాన్ఫిడెంట్‌గా ఫైనల్స్‌లోకి వచ్చేసింది టీమ్ ఇండియా. ఇక ఒక్క అడుగు పడితే చాలు.. కప్‌ మనదే. నిజానికి ఎన్నో ఏళ్లైంది టీమ్ ఇండియా ఐసీసీ టోర్నమెంట్‌లో కప్పు కొట్టి. అందుకే అభిమానులంతా కళ్లల్లో వత్తులు వేసుకొని మరీ చూస్తున్నారు. మళ్లీ మెన్‌ ఇన్ బ్లూ కప్పును ఎత్తే ఆ ఉద్విగ్న క్షణం కోసం.

- Advertisement -

మరి మన అపోనెంట్‌ సౌతాఫ్రికాను తక్కువగా అంచనా వేయొచ్చా ? అస్సలు వేయకూడదు.. ఎందుకంటే టీమ్‌ ఇండియాలాగానే ఈ టోర్నమెంట్‌లో ఒక్క మ్యాచ్‌ ఓడిపోకుండా ఫైనల్స్‌కు వచ్చేసింది సౌతాఫ్రికా. గ్రూప్‌ స్టేజ్‌లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో నాలుగు గెలిచింది. సూపర్ 8 స్టేజ్‌లో ఆడిన మూడు మ్యాచ్‌లు గెలిచేసింది. ఇక సెమీస్‌లో అయితే అప్పటి వరకు చెలరేగిపోయిన అఫ్ఘానిస్తాన్‌ను మట్టికరిపించింది. మొత్తం ఎనిమిది మ్యాచ్‌లు ఆడితే.. ఒక్కటి కూడా ఓడలేదు సౌత్ ఆఫ్రికన్స్. టు బీ ఫ్యాక్ట్ సౌతాఫ్రికా టీమ్‌ కప్పును ఎత్తుకోవడం అటుంచితే.. అసలు ఫైనల్స్‌కు రావడం ఇదే తొలిసారి. అందుకే ఏదేమైనా కప్పు సాధించాలన్న కసి కనిపిస్తోంది ఆ టీమ్‌లో. సౌతాఫ్రికా కూడా ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్‌ ఇస్తుంది. డికాక్.. మార్క్‌రమ్, క్లాసెన్, మిల్లర్, స్టబ్స్, జాన్సెన్ ఇలా ప్రతి ఒక్కరూ చెలరేగేవారే. ఫైనల్ ఫైట్‌ అంత ఈజీగా కనిపించడం లేదు.

Also Read : ఇక కోహ్లీ ఫస్ట్ డౌన్ ? దుబె వెళతాడు.. సంజూ వస్తాడు ?

ఇక టీమ్‌ ఇండియా పరిస్థితికి వస్తే.. కోహ్లీ అస్సలు ఫామ్‌లో లేడు. దూబే ఇప్పటి వరకు చెప్పుకునేంతగా ఏం చేయలేదు. ఈ ఇద్దరినీ అసలెందుకు సెలెక్ట్ చేశారనే సిట్యూవేషన్‌కి వచ్చారు ఫ్యాన్స్. రోహిత్‌ సూపర్ స్టార్ట్‌ ఇస్తున్నాడు. తనను హిట్ మ్యాన్‌ అని ఎందుకంటారో ప్రూవ్ చేస్తున్నాడు. ఇక పంత్, సూర్యకుమార్ యాదవ్ కూడా తమ బాధ్యతలను పర్ఫెక్ట్‌గా నిర్వర్తిస్తున్నారు. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్ లు చూస్తే రవీంద్ర జడేజా పర్ఫాలేదనిపించాడు. ఇక కుల్దీప్‌, అక్షర్‌ పటేల్‌ అయితే ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌ను వరుసగా పెవిలియన్‌ పంపేసి.. ఫైనల్స్‌కు ఎంట్రీ టికెట్ దొరికేందుకు హెల్ప్ చేశారు. అర్షదీప్‌ కాస్త పరుగులు ఇచ్చినా కీలక వికెట్లు తీస్తున్నాడు. ఇక బుమ్రా బౌలింగ్‌ను డీకోడ్ చేసే బ్యాట్స్‌మెన్‌ ఈ టోర్నమెంట్‌లో ఇప్పటి వరకు కనిపించలేదు. బెస్ట్‌ ఎకానమీతో కీలక వికెట్లను తన ఖాతాలో వేసుకుంటూ ఓ వారియర్‌ రోల్ ప్లే చేస్తున్నాడు. కాస్త అటు ఇటుగా ఉన్నా కానీ టీమ్‌ ఇండియా బలంగానే కనిపిస్తుంది.

రెండు టీమ్స్‌ పటిష్టంగానే ఉన్నాయి. కానీ మ్యాచ్ జరిగేందుకు వరణుడు ఏమాత్రం సపోర్ట్ చేస్తాడన్నది చూడాలి. ఎందుకంటే వెదర్ రిపోర్ట్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌ను కాస్త టెన్షన్ పెడుతోంది. ఎందుకంటే ఫైనల్ మ్యాచ్‌ జరిగే బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్, కెన్సింగ్టన్‌ ఓవల్‌లో వర్షం పడే సూచన ఉన్నట్టు కనిపిస్తుంది. వెదర్ రిపోర్ట్ చూస్తే.. 50 శాతానికి పైగా వర్షం పడొచ్చని ఉంది. అయితే ఇక్కడో పాయింట్ ఉంది. కాస్త వర్షం పడినా.. ఆకాశం మేఘావృతమై ఉన్నా.. పిచ్‌లు మొత్తం పేసర్లకు సపోర్ట్ చేస్తాయి. అలా కాకుండా వర్షం పడి మ్యాచ్‌ రద్దైతే పరిస్థితి ఏంటి? అయితే ఐసీసీ 29th న మ్యాచ్‌ జరగపోతే ఎలా అనే క్వశ్చన్‌కు ఆన్సర్ చెప్పింది.

Also Read : షెఫాలీ డబుల్, స్మృతి సెంచరీ.. సౌతాఫ్రికాతో టెస్ట్ మ్యాచ్ లో అమ్మాయిలు రికార్డ్ స్కోరు..

జూన్ 30న మ్యాచ్‌ నిర్వహించేందుకు రిజర్వ్‌ డేగా ఉంచింది. ఒకవేళ మ్యాచ్‌ ఈరోజు జరగకపోయినా.. 30న అంటే రేపు జరుగుతుంది. మరి రేపు కూడా వర్షం పడితే ఏంటి పరిస్థితి? అప్పుడు ఇక చేసేదేం లేదు..రెండు టీమ్స్‌ను విజేతలుగా ప్రకటిస్తున్నారు. కానీ అలా జరగకూడదు. మ్యాచ్‌ జరగాలి.. ఇప్పటి వరకు నువ్వా నేనా అన్నట్టు ఒక్కక్కరితో తలపడుతూ.. అందరినీ పడగొడుతూ వచ్చిన ఇరు టీమ్స్‌ గ్రౌండ్‌లో సై అంటే సై అనాలి. నిప్పులు చెరిగే బంతులు వేయాలి.. ఆ బంతులను బ్యాట్స్‌మెన్‌ బౌండరీలు దాటించాలి. పరుగుల వరద పారించాలి.. ఫుల్ క్రికెట్ మజా ఇవ్వాలి. చివర్లో మాత్రం ఇండియానే గెలవాలి. మెన్‌ ఇన్‌ బ్లూ కప్పు ఎత్తాలి.. సగర్వంగా దేశానికి తిరిగిరావాలి. ఇది నా ఒక్కడి కొరిక మాత్రమే కాదు. టీమ్‌ ఇండియాను అభిమానించే ప్రతి ఒక్క క్రికెట్‌ ఫ్యాన్‌ కోరిక. సో.. ఆల్ ది బెస్ట్‌ టీమ్ ఇండియా.. Bleed Blue.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News