Big Stories

Steve Smith:- 1 Ball.. 16 Runs!

Steve Smith new record :- ఒక్క బంతికే 16 పరుగులు.. ఇది ఎలాసాధ్యమైందని అనుకుంటున్నారా? ఈ మధ్య బ్యాటర్లు వీర లెవల్లో బాదుతుండటం, ఆ బాదుడుకు తోడు బౌలర్లు నో బాల్స్, వైడ్స్ వేసి మరిన్ని పరుగులు సమర్పించుకోవడం చూస్తూనే ఉన్నాం. అలా వచ్చినవే… ఒక్క బంతికి 16 పరుగులు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్‌బాష్‌ లీగ్‌లో ఈ ఫీట్ నమోదైంది. కొట్టింది.. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్.

- Advertisement -

సిడ్నీ సిక్సర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో… హోబర్ట్‌ హరికేన్స్‌ బౌలర్‌ జోయల్‌ పారిస్‌ ఒక్క బంతికే 16 పరుగులు సమర్పించుకున్నాడు. సిడ్నీ సిక్సర్స్ తరఫున స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ చేస్తుండగా బౌలింగ్ వేసిన జోయల్ పారిస్… తొలి రెండు బంతులకు పరుగులేమీ ఇవ్వలేదు. మూడో బంతికి స్టీవ్‌ స్మిత్‌ భారీ సిక్సర్‌ కొట్టాడు. ఆ బంతిని అంపైర్‌ నోబాల్‌గా ప్రకటించడంతో… బాల్ కౌంట్ కాకుండానే సిడ్నీ జట్టు ఖాతాలోకి 7 రన్స్ వచ్చాయి. ఫ్రీ హిట్ బంతిని కాస్తా జోయల్ వైడ్ వేశాడు. బంతి మరీ దూరంగా వేయడంతో దాన్ని కీపర్ కూడా పట్టుకోలేకపోయాడు. దాంతో అది ఫోర్ వెళ్లింది. ఈసారి కూడా బంతి కౌంట్ కాకుండానే వైడ్ వల్ల ఒక రన్, ఫోర్ వల్ల 4 రన్స్… మొత్తం 5 రన్స్ వచ్చాయి. అప్పటికి ఒక్క బంతికి 12 రన్స్ వచ్చినట్లు అయింది. జోయల్ మళ్లీ బంతి వేయగానే… ఫ్రీ హిట్ కావడంతో స్మిత్ భారీ షాట్ కొట్టాడు. అది కాస్తా ఫోర్ వెళ్లింది. దాంతో ఒక్క బంతికే మొత్తం 16 రన్స్ వచ్చినట్లయింది. ఇది సిడ్నీ సిక్సర్స్ ఆటగాళ్లలో జోష్ నింపగా… బౌలర్ జోయల్ పారిస్ తీవ్ర ఆవేదన చెందాడు. ఈ రేర్ ఫీట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

- Advertisement -

Follow this link for more updates:- Bigtv

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News