Big Stories

South Africa Vs Afghanistan: తొలి సెమీస్.. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న అఫ్గాన్..!

South Africa Vs Afghanistan T20 Semi Final Match: టీ20 ప్రపంచకప్‌లో మరో రసవత్తర సమరానికి సిద్దమయ్యారు. సంచలన ప్రదర్శనతో అఫ్గానిస్తాన్ అందరినీ ఆశ్చరపరిచింది. గురువారం జరిగే తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో డార్క్ హార్స్ దక్షిణాఫ్రికాను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌లో ఆఫ్గానిస్తాన్ గెలిస్తే చరిత్రే అవుతోంది. కేవలం ఆఫ్గానిస్తాన్ జట్టు మాత్రమే కాదు.. దక్షిణాఫ్రికా గెలిచిన హిస్టరీగా మిగిలిపోతుంది.

- Advertisement -

దక్షిణాఫ్రికా ఇప్పటివరకు ఏ ఫార్మాట్‌లోనూ ప్రపంచకప్ ఫైనల్ చేరలేదు. దీంతో ఈ మ్యాచ్ గెలిస్తే ఫైనల్ చేరే అవకాశం ఉంది. అటు అఫ్గానిస్తాన్ జట్టు కూడా ఏ మాత్రం తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే సెమీస్‌కు ముందు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి దిగ్గజ జట్లకు సైతం షాక్ ఇచ్చి మట్టి కరిపించింది. దీంతో అఫ్గానిస్తాన్ రెట్టింపు ఉత్సాహంతో సెమీస్‌లో కి దూసుకొచ్చింది.

- Advertisement -

Also Read: Virat Kohli : కోహ్లీ ఫైనల్ గెలిపిస్తాడు : కెప్టెన్ రోహిత్ శర్మ

దక్షిణాఫ్రికా, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య ఇవాళ తొలి సెమీస్ జరగనుంది. టాస్ గెలిచిన అఫ్గాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. అఫ్గాన్ జట్టులో అందరూ దూకుడుగా ఆడుతున్నారు. కెప్టెన్ రషీద్ ఖాన్ టోర్నీ ఆరంభం నుంచి అదరగొడుతున్నాడు. ఇక పేసర్లు ఫారూఖీ, నవీనుల్ హక్ కీలక సమయాల్లో వికెట్లను పడగొడుతున్నారు. ఇటీవల ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో నైబ్ అద్భుతంగా బౌలింగ్ వేశాడు. బ్యాటింగ్ విషయంలో ఇప్పటివరకు గుర్భా్ 281 పరుగులు చేశాడు. మరోసారి చెలరేగుందుకు సిద్ధంగా ఉన్నాడు. బౌలర్ల జాబితాలో ఫారూఖీ 16 వికెట్లతో ముందున్నాడు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News