Big Stories

South Africa Down in ICC Tournaments: ప్చ్.. దక్షిణాఫ్రికా..

South Africa Down in ICC Tournaments: దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుకు కప్పు కొట్టలేదా. ఐసీసీ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క కప్పు కూడా నెగ్గలేదు. 2024 టీ20 వరల్డ్ కప్‌లో సెమీస్ గండాన్ని దాటినా కప్పు దక్కించుకోలేకపోయారు. ఇండియాతో జరిగిన ఫైనల్లో విజయం ముంగిట బోల్తాపడింది. ఓ దశలో 30 బంతుల్లో 30 పరుగులు చేయాల్సి ఉండగా వరుస వికెట్లు కోల్పోయి 7 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. మార్క్‌రమ్, డి కాక్, క్లాసెన్, రబాడా వంటి మేటి ఆటగాళ్లున్నా కప్పు సాధించలేకపోయింది.

- Advertisement -

ఇక ఐసీసీ టోర్నీల్లో దక్షిణాఫ్రికా ఇప్పటివరకు 9 సార్లు సెమీస్ చేరింది. కేవలం ఒక్కసారి మాత్రమే ఫైనల్ చేరింది.. అది కూడా ఈ టీ20 ప్రపంచ కప్‌లోనే. మొదటిసారిగా 1992 వన్డే వరల్డ్ కప్‌లో సెమీస్ చేరిన సఫారీలు ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో దురదృష్టవశాత్తు వర్షం కారణంగా ఓటమి చవిచూసింది. 7 బంతుల్లో 22 పరుగులు చేయాల్సిన తరుణంలో వర్షం కారణంగా ఆ సమీకరణం 1 బంతిలో 22 పరుగులుగా మారింది. దీంతో ఓటమి తప్పలేదు.

- Advertisement -

ఇక 1999 వన్డే ప్రపంచ కప్‌లో సెమీస్ చేరిన సఫారీలు మళ్లీ ఆస్ట్రేలియాతో తలపడింది. 214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీల విజయానికి చివరి ఓవర్లో 9 పరుగులు చేయాల్సి వచ్చింది. క్లుసెనర్ వీరోచిత పోరాటం చేసిన చివరకు మ్యాచ్ టై అవ్వడంతో ఆస్ట్రేలియా ఫైనల్ చేరింది.

2007 వన్డే ప్రపంచ కప్‌లో మళ్లీ సఫారీలు సెమీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడ్డారు. గ్రేమ్ స్మిత్, కలీస్, గిబ్స్, డీవిల్లియర్స్, బౌచర్ వంటి మేటి ఆటగాళ్లున్నా ఈ మ్యాచ్‌లో సఫారీలను ఆసీస్ ఊచకోత కోసింది.

రెండేళ్ల తర్వాత 2009 టీ20 ప్రపంచ కప్‌లో సెమీస్ చేరింది సఫారీ జట్టు. అయితే ఈ సారి ప్రత్యర్థి పాకిస్థాన్. ఈ మ్యాచ్‌లో షాహిద్ అఫ్రిదీ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో సఫారీలు ఇంటిబాట పట్టారు.

2013 ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీస్ చేరిన సఫారీ జట్టు ఇంగ్లాండ్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో సఫారీ బ్యాటర్లు చేతులెత్తేయడంతో ఇంగ్లాండ్ ఫైనల్ చేరింది. కానీ ఫైనల్లో ఇండియా చేతిలో పరాజయం పాలయ్యింది.

ఇక 2014 టీ20 ప్రపంచ కప్‌లో సెమీస్ చేరిన సౌతాఫ్రికా జట్టు ఇండియాతో తలపడింది. కానీ ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 72 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో మరోసారి సెమీస్‌లోనే ఇంటిబాట పట్టింది సఫారీ జట్టు.

మనం చెప్పుకోవాల్సింది 2015 వన్డే వరల్డ్ కప్ గురించి. ఈ ప్రపంచ కప్‌లో సఫారీ జట్టు సెమీస్ చేరింది. సెమీస్‌లో న్యూజిలాండ్‌తో తలపడిన దక్షిణాఫ్రికా జట్టు ఒత్తిడిని జయించలేక గెలుపు ముంగిట బోల్తాపడింది.

Also Read: విశ్వవిజేతగా భారత్.. ఉత్కంఠపోరులో చతికిలపడ్డ సఫారీలు..

2023 వన్డే వరల్డ్ కప్‌లో సఫారీ జట్టు సెమీస్ చేరింది. ప్రత్యర్థి ఆస్ట్రేలియానే. 134 పరుగుల తేడాతో ఓటమి మూటగట్టుకుంది సఫారీ జట్టు.

ప్రస్తుత టీ20 ప్రపంచ కప్ లో సఫారీ జట్టు సెమీస్ గండాన్ని అయితే దాటింది కానీ కప్పు మాత్రం దక్కించుకోలేకపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే గెలిచే మ్యాచ్‌ను చేజేతులా కోల్పోయింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News