Big Stories

IND W vs SA W Test: షెఫాలీ డబుల్, స్మృతి సెంచరీ.. సౌతాఫ్రికాతో టెస్ట్ మ్యాచ్ లో అమ్మాయిలు రికార్డ్ స్కోరు..

IND W vs SA W Test Match Day 1: అటు టీ 20 ప్రపంచకప్ లో టీమ్ ఇండియా అద్భుతంగా ఆడి ఫైనల్ కి దూసుకెళ్లింది. వారిని చూసి అమ్మాయిలు కూడా ఇన్ స్పైర్ అయినట్టున్నారు. దాదాపు పదేళ్ల తర్వాత సౌతాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్ లో ఓపెనర్లు అద్భుతంగా ఆడారు. షెఫాలీ వర్మ డబుల్ సెంచరీ చేసింది.

- Advertisement -

స్మృతి మంథాన 149 పరుగులు చేసింది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ప్రారంభమైన తొలి టెస్టులో టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 431 పరుగులు చేశారు.

- Advertisement -

ఓపెనర్లు షెఫాలీ వర్మ 197 బంతుల్లో 8 సిక్స్ లు, 23 ఫోర్ల సాయంతో 205 పరుగులు చేసింది. స్మృతి మంథాన 161 బంతుల్లో 1 సిక్స్, 27 ఫోర్ల సాయంతో 149 పరుగులు చేసింది. ఒకానొక దశలో సౌతాఫ్రికా బౌలర్లు అందరూ ప్రయత్నించినా వీరి జోడిని విడదీయలేకపోయారు.

చివరికి అనుకోకుండా స్మృతి మంథాన రన్ అవుట్ అయ్యింది. అలా వికెట్ పడింది తప్ప, వీరిని అవుట్ చేయడం దక్షిణాఫ్రికా బౌలర్ల వల్ల కాలేదు. జట్టు స్కోరు 292 పరుగుల వద్ద మంథాన రనౌట్ గా వెనుతిరిగింది. షెఫాలీ, మంథాన ఇద్దరూ తొలి వికెట్ కు 292 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇప్పటివరకు మహిళా టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి వికెట్ కు 241 పరుగులు చేసిన కిరణ్ బలుచ్, సజ్జిదా షా జోడీ రికార్డును వీరు బద్దలు కొట్టారు.

ఈ మ్యాచ్ లో రెండు రికార్డులు బద్దలయ్యాయి. అత్యధిక భాగస్వామ్యం రికార్డుతో పాటు, తొలిరోజు ఆటలో అత్యధిక పరుగులు చేసి జట్టుగా నిలిచింది. 1935లో ఇంగ్లండ్-న్యూజిలాండ్ మ్యాచ్ లో బ్రిటన్ మహిళలు తొలిరోజు 4 వికెట్ల నష్టానికి 431 పరుగులు చేశారు. అదే ఇప్పటివరకు హయ్యస్ట్ స్కోరుగా ఉంది. 89 ఏళ్ల తర్వాత మన టీమ్ ఇండియా అమ్మాయిలు బద్దలు కొట్టారు.

Also Read: భారత ఉమెన్ ఓపెనర్లు న్యూ రికార్డు, సెంచరీలు చేసిన..

తొలిరోజు ఆట ముగిసే సమయానికి క్రీజులో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (42 నాటౌట్), రిచా ఘోష్ (43 నాటౌట్) ఉన్నారు. ఇక ఫస్ట్ డౌన్ వచ్చిన సుభా సతీశ్ (15), జెమీమా రోడ్రిగ్స్ (55) చేశారు.

వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన ఇండియా వుమెన్స్ టీమ్ సౌతాఫ్రికాతో జరిగే ఏకైక టెస్టు మ్యాచ్ లో కూడా ఆధిక్యత ప్రదర్శిస్తోంది. అయితే వన్డేల్లో తేలిపోయిన సఫారీ అమ్మాయిలు కనీసం టెస్టు మ్యాచ్ లోనై గట్టి పోటీ ఇవ్వాలని ప్రయత్నించి విఫలమయ్యారు.

ఇండియా వుమన్స్ జట్టులో స్మ్రతి మంథాన, షెఫాలీ వర్మ, శుభా సతీష్, హర్మన్ ప్రీత్ (కెప్టెన్), రిచా ఘోష్ ( వికెట్ కీపర్), దీప్తి శర్మ, స్నేహ్ రాణా, పూజా వస్త్రాకర్, రేణుకా ఠాగూర్ సింగ్, రాజేశ్వరి గయక్వాడ్, ప్రియా పునియా, సైకా ఇషాక్, షబ్నమ్, ఉమా ఛెత్రీ ఉన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News