Big Stories

Shivam Dube And Jadeja : శివమ్ దుబె, రవీంద్ర జడేజా అవుట్ ?

Shivam Dube And Jadeja : టీ 20 ప్రపంచకప్ సూపర్ 8లో భాగంగా బంగ్లాదేశ్ తో టీమ్ ఇండియా నేడు రెండో మ్యాచ్ ఆడనుంది. ఆంటిగ్వాలో జరిగే మ్యాచ్ పేసర్లకు అనుకూలంగా ఉండటంతో మళ్లీ మనవాళ్లు ముగ్గురు పేసర్లు సిరాజ్ తో కలిసి బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే జట్టులో రెండు మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

- Advertisement -

ముఖ్యంగా బ్యాటింగ్ ఆర్డర్ లో చివర్లో వచ్చే శివమ్ దుబె స్కోరు పెంచడంలో ఇబ్బందులు పడుతున్నాడు. దీంతో తనని తప్పించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఎందుకంటే అతని ప్లేస్ లో స్పెషలిస్ట్ బ్యాటర్ గా సంజూ శాంసన్ లేదా యశస్వి జైశ్వాల్ ను తీసుకురావాలని చూస్తున్నారు.

- Advertisement -

అలాగైతే రోహిత్ శర్మ తో వీరిద్దరిలో ఒకరు ఓపెనింగ్ చేస్తారు. ఎప్పటిలా విరాట్ కొహ్లీ ఫస్ట్ డౌన్ వస్తాడు. అప్పుడు బ్యాటింగ్ ఆర్డర్ బాగుంటుంది. ఇప్పుడు ఏదైతే వెలితి ఉందో అది తీరిపోతుంది. సెకండ్ డౌన్ సూర్యకుమార్ వస్తాడు. తర్వాత హార్డ్ హిట్టర్ గా రిషబ్ పంత్ వస్తాడు. ఇక్కడికి ఐదుగురు అవుతారు.

Also Read : ఈ ఒక్కటీ గెలిస్తే ..సెమీస్ కి చేరిపోవచ్చు

తర్వాత నుంచి హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ ఇద్దరు ఆల్ రౌండర్లు వస్తారు. నలుగరు బౌలర్లు కులదీప్, అర్షదీప్, బుమ్రా, సిరాజ్ ఇలా మొత్తం 11 మందితో టీమ్ ఇండియా సీక్వెన్స్ ఉండనుందని నెటిజన్లు పేర్కొంటున్నారు.

మరో విషయం ఏమిటంటే శివమ్ దుబెకి పెద్దగా బౌలింగు చేసే అవకాశం రావడం లేదు. ఎందుకంటే హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా అందరూ ఆల్ రౌండర్లే. దీంతో శివమ్ దుబె ప్లేస్ లో స్పెషలిస్టు బ్యాటర్ ని తీసుకోవాలని టీమ్ ఇండియా భావిస్తోంది.

ఇక సీనియర్ ప్లేయర్ అయిన రవీంద్ర జడేజాని కూడా బెంచ్ కే పరిమితం చేయాలని చూస్తున్నారు. తన ప్లేస్ లో సిరాజ్ ఆడే అవకాశాలున్నాయి. ఎందుకంటే రవీంద్ర జడేజా అటు బౌలింగు, ఇటు బ్యాటింగ్ రెండింటా విఫలమవుతున్నాడు.

అందువల్ల ఆ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. మొత్తానికి కీలకమైన బంగ్లాదేశ్ మ్యాచ్ లో గెలిస్తే, దాదాపు టీమ్ ఇండియా సెమీస్ కి చేరినట్టేనని అంటున్నారు. మరేం జరుగుతుందో చూడాల్సిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News