Big Stories

Rohit Sharma: బార్బడస్ పిచ్ రుచి చూడటం వెనుక కారణమదే: రోహిత్ శర్మ

Rohit Sharma Comments On Barbados Pitch Tasting: టీ20 ప్రపంచ కప్ విన్నింగ్ కెప్టెన్ రోహిత్ శర్మ ఎట్టకేలకు నిజం బయటపెట్టాడు. జూన్ 29న బార్బడాస్‌లో టీ20 ప్రపంచ కప్ ఫైనల్ గెలిచిన తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కెన్సింగ్‌టన్ ఓవల్ పిచ్ రుచి చూశాడు. అలా ఎందుకు చేశాడా అని క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఎట్టకేలకు రోహిత్ శర్మ దాని వెనుక ఉన్న రహస్యాన్ని బట్టబయలు చేశాడు.

- Advertisement -

2007 టీ20 ప్రపంచ కప్ గెలిచిన టీమిండియా ఆ తరువాత ట్రోఫీ గెలవడానికి 17 ఏళ్లు పట్టిందని.. ఆ క్షణాన్ని ఎప్పటికీ గుర్తించుకోవాలని అనిపించిందని.. అందుకే ఆ పిచ్ మట్టిని రుచి చూశానని విన్నింగ్ కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు.

- Advertisement -

జులై 4న స్వదేశానికి వచ్చిన టీమిండియా ప్రధాని మోదీతో కలసి అల్పాహారం చేశారు. కాగా ఈ బ్రేక్ ఫాస్ట్ మీట్ లో ప్రధాని మోదీ రోహిత్ శర్మను పిచ్ రుచి చూడటం వెనుక గల కారణాన్ని అడిగారు. దీంతో హిట్ మ్యాన్.. కెన్సింగ్‌టన్ ఓవల్‌ గడ్డ మీద 17 ఏళ్ల తర్వాత ప్రపంచ కప్ గెలిచామని.. అందుకే దానికి గుర్తుగా ఏదో ఒకటి చేయాలనుకున్నానని చెప్పాడు. అందుకే పిచ్ మీద మట్టిని నోట్లో వేసుకున్నానని అన్నాడు. ఆ పిచ్ పైనే ప్రపంచ కప్ గెలిచామని.. ప్రతి ఒక్కరు సమిష్టిగా రాణించారని అన్నాడు. చాలా సార్లు టోర్నీ చివర వరకు వచ్చి ఓటమి చవిచూశామని అన్నాడు.

అంతే కాకుండా ట్రీఫీ తీసుకోడానికి వెళ్లేటప్పుడు రోహిత్ శర్మ నడక గురించి అడిగారు. అందుకు హిట్ మ్యాన్ స్పందిస్తూ.. చాహల్, కుల్దీప్ యాదవ్ ఏదైనా కొత్తగా ట్రై చెయ్యమని అడిగారని అందుకే భిన్నంగా ఉండేందుకు అలా నడిచానని అన్నాడు.

గతంలో ఐపీఎల్ 2024 ట్రోఫీని అందుకోడానికి కోల్‌కతా నైట్ రైడర్స్ సారథి శ్రేయాస్ అయ్యర్, ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ట్రోఫీ వాక్ చేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News