Big Stories

Rohit Sharma Retirement: విరాట్ కోహ్లి బాటలోనే రోహిత్.. టీ20లకు టీమిండియా కెప్టెన్ రిటైర్మెంట్

Rohit Sharma Retirement: టీమిండియా కెప్టెన్, స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లకు రిటైర్మెంట్ ప్రకటించారు. టీ20 వరల్ట్ కప్ 2024లో భాగంగా శనివారం దక్షిణాఫ్రికాతో చివరి బంతి వరకు జరిగన ఉత్కంఠ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. ఫైనల్‌లో గెలిచిన అనంతరం రోహిత్. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే వన్డే, టెస్టుల్లో కొనసాగుతానని చెప్పారు.

- Advertisement -

టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నట్లు రోహిత్ పేర్కొన్నాడు. నా కెరీర్ ఈ ఫార్మాట్‌తోనే ప్రారంభమైందని, ఈ కప్ గెలవడంతో నా కోరిక నెరవేరిందని ప్రెస్ మీట్‌లో వెల్లడించాడు. రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించడానికి కొన్ని నిమిషాల ముందు రన్ మెషీన్ విరాట్ కోహ్లి కూడా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

- Advertisement -

2007లో జరిగిన టీ20 వరల్డ్ కప్‌తో రోహిత్ శర్మ టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. దాదాపు టీమిండియాకు 17 ఏళ్లు ప్రాతినిధ్యం వహించిన రోహిత్ టీ 20 వరల్డ్ కప్ 2004 అనంతరం సుదీర్ఘ ప్రయాణానికి ముగింపు పలికాడు.

టీ20 కెరీర్‌లో 159 మ్యాచ్‌లు ఆడిన రోహిత్..4,231 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీ, 32 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. దీంతో అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన లిస్ట్ లో ప్రస్తుతం రోహిత్ మొదటి స్థానంలో ఉన్నాడు. తర్వాతి స్థానంలో టీమిండియా ఆటగాడు 4,188 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక, రోహిత్ కెప్టెన్సీలో టీమిండియా వన్డే, టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది.

Also Read: హార్ట్ బ్రేకింగ్ న్యూస్.. రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లి

టీమిండియా రెండోసారి టీ20 వరల్డ్ కప్‌ను ముద్దాడింది. ఎంఎస్ ధోనీ నాయకత్వంలో 2007 లో తొలి వరల్డ్ కప్ సాధించింది. తర్వాత సరిగ్గా 17 ఏళ్ల తర్వాత మళ్లీ ట్రోపీ అందుకుంది. దీంతో ధోనీ తర్వాత ఈ ఘనత సాధించిన కెప్టెన్‌గా రోహిత్ శర్మ చరిత్రలో నిలిచిపోయాడు. అయితే ఈ సారి కప్టెన్సీ ఇన్నింగ్స్‌లు ఆడి జట్టును ఫైనల్ చేర్చాడు. కాగా, గతేడాది వన్డే వరల్డ్ కప్ ఫైనల్ చేరినా అడుగుదూరంలో మిస్ అయింది. తాజాగా, దక్షిణాఫ్రికాపై చివరి వరకు పోరాడి టీమిండియా గెలిచి ట్రోఫీసొంతం చేసుకుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News