Big Stories

Rohit Sharma: భారతీయులకి.. రోహిత్ శర్మ కౌన్సెలింగ్ !

Rohit Sharma Opens Up On India’s Big Challenge Ahead Of T20 World Cup 2024 Super 8:
క్రికెట్ అంటే భారతీయులకి పిచ్చి ప్రేమ. టీ 20 ప్రపంచకప్ లాంటి మ్యాచ్ లు అయితే,  అది మరింత ముదురుతుంది. ఒకవేళ ఓడిపోతే, స్వదేశంలో ఎదురయ్యే పరిణామాలను ఆల్రడీ పాకిస్తాన్ జట్టు అనుభవిస్తోంది. ఇలాంటి పరిస్థితి తమకి ఎదురు కాకూడదని టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అనుకున్నాడో ఏమో తెలీదు.

- Advertisement -

టీ 20 ప్రపంచకప్ లు మొదలైన దగ్గర నుంచి ఒక విధమైన కామెంట్లు చేయడం మొదలుపెట్టాడు. అంటే ప్రజలు, క్రికెట్ అభిమానుల్లో ఒక అభిప్రాయాన్ని పాదుకొల్పడానికి అతను ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అనిపిస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

- Advertisement -

టీ 20 ప్రపంచకప్ లో న్యూయార్క్ వేదికగా టీమ్ ఇండియా మూడు మ్యాచ్ లు ఆడింది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ ఏమన్నాడంటే.. ఈ పిచ్ మీద 150 పరుగులు మించి చేస్తే, మంచి స్కోరే అన్నాడు. తర్వాత 130 పరుగులు వచ్చినా చాలు, కాపాడుకోగలమని అన్నాడు. ఇలాంటి పిచ్ లు మీద దెబ్బలు తగలకుండా ఆడటం సామాన్యమైన విషయం కాదని అన్నాడు. అంతేకాదు టీ 20 ప్రపంచకప్ లాంటి మెగా టోర్నమెంటులో ఇలాంటి పిచ్ లు కరెక్టు కాదని అన్నాడు.

నిజానికి పిచ్ ఎలాగున్నా, అంతర్జాతీయ స్థాయి ఆటగాడు ఆడాల్సిందేనని వాదించే రోహిత్ శర్మ ఎందుకిలా ప్లేట్ మార్చాడని అంతా అనుకున్నారు. తర్వాత ఇప్పుడు కొత్తగా సూపర్ 8కి వచ్చిన తర్వాత మరో పల్లవి అందుకున్నాడు.

ఐదురోజుల వ్యవధిలో మూడు మ్యాచ్ లు ఆడమంటే ఎలా? ఇది సాధ్యమేనా? చాలా దూరాలు విమానాల్లో ప్రయాణించాలి. జెట్ లాగ్ ఉంటుంది. అందరూ అలసిపోతారు. ఇలా మ్యాచ్ అయిన వెంటనే అలా విమానం ఎక్కాలి. అది దిగిన వెంటనే, ప్రాక్టీస్ కి పరుగెట్టాలి. మరుసటి రోజు మ్యాచ్ ఆడాలి.. ఇలా మొదలెట్టాడు. అయినా పర్వాలేదు, నేను దీనిని సాకుగా చూపించడం లేదని అన్నాడు.

ఏంట్రా.. మనోడు ఇలా అంటున్నాడని నెటిజన్లు తెగ జుత్తు పీకేసుకుంటున్నారు. ఏంటీ ఇంతలా సుఖపడిపోతే ఎలాగ? మ్యాచ్ లు అన్నాక కష్టపడాలి కదా.. టీమ్ ఇండియాలో 11 మంది ప్లేయర్లలో ఎంపికవడమే గొప్ప.. తీరా ఎంపికయ్యాక, ఇక చాలు జీవితానికి అన్నట్టు ఉంటే ఎలా? అని కామెంట్లు పెడుతున్నారు.

Also Read: పాక్ లోనే కాదు..ఇండియాలోనూ అంతే..! భారత క్రికెటర్లకు చేదు అనుభవాలు

చివరికి కొందరు ఏమని నిగ్గు తేల్చారంటే.. రోహిత్ శర్మ మామూలోడు కాదు.. జనాన్ని ముందుగానే ట్యూన్ చేస్తున్నాడు. వారి మైండ్ ని సెట్ చేస్తున్నాడు. ఒకవేళ ఓడిపోతే జనం రివర్స్ కాకుండా చూసుకుంటున్నాడని అంటున్నారు.

ప్రతీ క్రికెటర్లకి కొందరు డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. వారి చేత కొన్ని మెసేజులు పెట్టిస్తుంటారన్నమాట. సూపర్ 8లో ఇలా రెస్ట్ లేకుండా వరుసపెట్టి మ్యాచ్ లు పెడితే ఎవడు ఆడతాడు? అని వాళ్లంటారు. మరొకడు కుదురుండక దానికి కౌంటర్ ఇస్తాడు. అది అలా నిప్పులా మండుతుందన్నమాట. దాంతో మన క్రికెటర్లందరూ సేఫ్ గా ఇండియా వచ్చేస్తారని అసలు విషయాన్ని చెబుతున్నారు.

ముందా ఏడుపు ఆపండి.. ఎలా గెలవాలో ఆలోచించండి.. అని కొందరంటున్నారు. ఇప్పుడే మానసికంగా సగం నీరసించిపోతే, ఇక గ్రౌండులో వీళ్లేం పోరాడతారని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి రోహిత్ శర్మ నెటిజన్లకు పెద్ద పనే పెట్టాడని అంటున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News